Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి 'ఆహా' స‌ర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   21 Jan 2022 3:25 AM GMT
సూప‌ర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి ఆహా స‌ర్ ప్రైజ్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానుల నిరీక్ష‌ణ‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. ఎన్నో రోజులుగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మ‌హేష్ అభిమానుల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఎట్ట‌కేల‌కు మ‌హేష్ - బ‌ల‌కృష్ణ ల ఫైన‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ వ‌చ్చేసింది. వెండితెర‌పై ప‌దునైన డైన‌మేట్ లాంటి డైలాగ్ ల‌తో ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో వ‌ణుకు పుట్టిస్తుంటారు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. ఆయ‌న తొలి సారి హోస్ట్ గా మారి `ఆహా` ఓటీటీ కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె`టాక్ షో చేస్తున్నారు.

ఈ షోలోకి గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చిన వారిని త‌న‌దైన స్టైల్లో ప్ర‌శ్నిస్తూ బాల‌య్య ఓ ఆట ఆడుకుంటున్నారు. గెస్ట్ లు కూడా స‌ర‌దాగా బాల‌య్య‌తో క‌లిసి సంద‌డి చేస్తున్నారు. దీంతో ఈ షో టాప్ రేటింగ్ లో రికార్డు సృష్టించింది. ఐఎండీబీలో ఈ షో 9.8 రేటింగ్ సాధించి టాక్ షోల్లో స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుని వార్త‌లంలో నిలిచింది. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ టాక్ షో సీజ‌న్ చివ‌రి అంకానికి చేరింది.

ఈ సీజ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్ త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ పోస్ట‌ర్ ని గ‌తంలోనే మేక‌ర్స్ రిలీజ్ చేసి ప్ర‌క‌టించారు కానీ ఇంత వ‌ర‌కు ఈ ఎపిసోడ్ ని రివీల్ చేయ‌క‌పోవ‌డంతో మ‌హేష్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. ఇప్ప‌టికే దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా జ‌రిగింది. అయితే ఇప్ప‌టికి మ‌హేష్ అభిమానుల‌ నిరీక్ష‌ణ ఫ‌లించింది.

తాజాగా ఈ ఫైన‌ల్ ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే తేదీని `ఆహా` నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ఫైన‌ల్ ఎపిసోడ్ కావ‌డం, మ‌హేష్ తొలిసారి బాల‌య్య‌తో క‌లిసి సంద‌డి చేయ‌బోతుండ‌టంతో ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ జ‌రుగుతుంది? ... బాల‌కృష్ణ - మ‌హేష్ ఇన్నేళ్ల కాలంలో క‌లిసి మాట్లాడుకున్న సంద‌ర్భాలు కానీ ఒకే స్టేజ్ పై క‌నిపించిన సంద‌ర్భాలు కానీ లేవు. దీంతో వీరి స్క్రీర్ ప్ర‌జెన్స్ ఎలా వుంటుంది? ... మ‌హేష్ ఎలా స్పందిస్తారు? అన్న‌ది ఇప్పుడు అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అన్ స్టాప‌బుల్ సీజ‌న్ ఈ ఎపిసోడ్ తో ఎండ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ని మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వరి 4వ తేదీ నుంచి ఈ ఫైన‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుఏంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆల్ ఎపిసోడ్స్ తో అత్య‌ధిక వ్యూస్ ని రాబ‌ట్టి రికార్డు సృష్టించిన `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` మ‌హేష్ ఫైన‌ల్ ఎపిసోడ్ తో స‌రికొత్త రికార్డుని క్రియేట్ చేసి టాక్ షోల్లో బెంచ్ మార్క్ ని సెట్ చేయ‌డం ఖాయం అని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ఫైన‌ల్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాబోతోంది.