Begin typing your search above and press return to search.

మహేష్ బాబు అల్లుడు ఎంట్రీ అంతా రెడీ !

By:  Tupaki Desk   |   28 Aug 2019 4:56 AM GMT
మహేష్ బాబు అల్లుడు ఎంట్రీ అంతా రెడీ !
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బావ సుధీర్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మహేష్ అక్క కొడుకు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవ్వడానికి సిద్ధమవుతున్నాను. ఇప్పటికే యాక్టింగ్- డాన్సుల్లో ట్రైనింగ్ తీసుకున్న అశోక్ త్వరలోనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నిజానికి అశోక్ గల్లా గతేడాది దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సింది. శశి అనే దర్శకుడితో కథ కూడా ఒకే చేసి సినిమాను ఘనంగా ప్రారంభించారు. కట్ చేస్తే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సల్ అయింది. అయితే ఇప్పుడు అంతా సెట్ చేసుకొని అశోక్ డెబ్యూ ప్లాన్ చేశాడట గల్లా జయదేవ్. దేవదాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య కు అశోక్ మొదటి సినిమా భాద్యతలు అప్పగించారని సమాచారం.

ఇప్పటికే అశోక్ కోసం కథ రెడీ చేసిన శ్రీరామ్ ఆదిత్య త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాతో గల్లా జయదేవ్ నిర్మాతగా మరబోతున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఆడంబరాలు లేకుండా డైరెక్ట్ గా షూట్ కి వెళ్లాలని భావిస్తున్నారట. మరి అశోక్ కూడా సుధీర్ బాబు లాగే హీరోగా నిలబడి వరుస సినిమాలు చేస్తాడా చూడాలి.