Begin typing your search above and press return to search.

నెవెర్ బిఫోర్ తరహాలో మహర్షి ఈవెంట్

By:  Tupaki Desk   |   11 May 2019 6:35 AM GMT
నెవెర్ బిఫోర్ తరహాలో మహర్షి ఈవెంట్
X
లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుంటూ గురువారం విడుదలైన మహర్షి మొదటి రోజు మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఆల్ టైం బెస్ట్ ఓపెనర్ గా మారలేకపోయినా వచ్చిన ఫిగర్స్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా దీని విజయోత్సవాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతల్లో ఒకరైన పివిపి ప్రసాద్ డేట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయట.

విజయవాడ కృష్ణ నది తీరంలో కనివిని ఎరుగని రీతిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అనుమతి దొరకకపోతే లయోలా కాలేజీ గ్రౌండ్ ని కూడా ఆప్షన్ గా పెట్టుకున్నారు. అయితే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి అంతకన్నా ముందు ఇది చేస్తే సెక్యూరిటీ అందించేందుకు పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉండకపోవచ్చు

ఈ కారణాల వల్ల మే 23 తర్వాత జరిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రసాద్ చెప్పినట్టు 18 లేదా అంతకన్నా ముందు అయితే సక్సెస్ ఊపులో ఇంకొంచెం మైలేజ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరీ ఆలస్యం అయినా ఇబ్బందే. ఇదే వేదికపై మహేష్ పాతిక సినిమాలు తీసిన దర్శకులు నిర్మాతలను సన్మానించబోతున్నారట.

మొన్న ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయిన కృష్ణ గారు దీనికి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన పర్మిషన్ వచ్చాక తెలుస్తుంది. మొదటి రోజు 24 కోట్ల షేర్ తో సూపర్ ఓపెనింగ్ సాధించిన మహర్షి ఈ రోజు రేపు కూడా జోరును కొనసాగించనుంది. సోమవారం కూడా డ్రాప్ ఎక్కువగా ఉండకుండా స్టడీగా ఉంటే మాత్రం రికార్డుల అరాచకం మొదలవుతుంది