Begin typing your search above and press return to search.

గుసగుస‌.. ఇంత వేగంగా గ్రాఫ్ ప‌డిపోతుంద‌ను కోలేదు!

By:  Tupaki Desk   |   10 March 2023 3:00 PM GMT
గుసగుస‌.. ఇంత వేగంగా గ్రాఫ్ ప‌డిపోతుంద‌ను కోలేదు!
X
కెరీర్ ప్రారంభించిన కేవ‌లం ఐదేళ్ల‌లోనే వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్ గా ఎదిగేసింది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న‌. ఛ‌లో- గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకొచ్చింది. అటుపై పుష్ప‌- ది రైజ్ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకుని నేరుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. శ్రీ‌వ‌ల్లిగా పుష్ప -1 లో త‌న న‌ట‌న‌కు మంచి మార్కులే వేసారు ఆడియెన్. నేష‌న‌ల్ క్ర‌ష్ గా ఓ వెలుగు వెలిగిన ర‌ష్మిక‌కు ఉత్త‌రాదినా ఫాలోయింగ్ పెరిగింది.

కానీ ఇంత‌లోనే ర‌ష్మిక కెరీర్ ని చీక‌టి మ‌బ్బులు క‌మ్ముకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే దానికి కార‌ణం హిట్టును న‌మ్మే ప‌రిశ్ర‌మ‌లో ఆ ఒక్క‌టీ ద‌క్క‌క‌పోవ‌డ‌మేన‌నే గుస‌గుస వినిపిస్తోంది. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు టాలీవుడ్ లో ఫ్లాప్ షో. బ్లాక్ బ‌స్ట‌ర్ సీతారామంలో స‌హాయ‌క పాత్ర త‌ర‌హా కావ‌డంతో త‌న‌కు అంత‌గా క‌లిసి రాలేదు.

ఇటు త‌మిళంలో విజ‌య్ సర‌స‌న న‌టించిన వారిసులో ర‌ష్మిక పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం.. అటు బాలీవుడ్ ఆరంగేట్ర చిత్రాలైన గుడ్ బాయ్ - మిష‌న్ మ‌జ్ను (నెట్ ఫ్లిక్స్ రిలీజ్) జ‌నాద‌ర‌ణ లేక నిరాశ‌ప‌ర‌చ‌డం త‌న‌కు పెద్ద మైన‌స్ అయింది. దీంతో ఇప్పుడు న‌టిస్తున్న యానిమ‌ల్ - పుష్ప 2 చిత్రాలే త‌న‌ని ఆదుకోవాల్సిన స‌న్నివేశం ఉంది. ర‌ష్మిక ఆశ‌ల‌న్నీ ఆ రెండు సినిమాల‌పైనే.

అయితే సుకుమార్ పుష్ప చిత్రంలో ర‌ష్మిక పాత్ర‌కు గొప్ప ప్రాధాన్య‌త‌నిచ్చారు. శ్రీ‌వ‌ల్లిగా హీరోతో రొమాంటిక్ స‌న్నివేశాలు.. ఇంటెన్స్ స‌న్నివేశాల‌తో గ్రాఫ్ ని పెంచాడు. ఇప్పుడు దానికి కొన‌సాగింపు భాగంలో ర‌ష్మిక పాత్ర‌కు అంత‌గా ఎలివేష‌న్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని పుష్ప‌రాజ్ భార్య‌గా త‌న పాత్ర ప‌రిమిత సన్నివేశాల‌కే అంకిత‌మ‌వుతుంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. పుష్ప‌రాజ్ హీరోయిజంపై సుక్కూ గురి పెడితే ఇత‌ర పాత్ర‌ల‌కు స్కోప్ చాలా వ‌ర‌కూ త‌గ్గిపోతుంది.

అలాగే సందీప్ రెడ్డి వంగా ర‌ణ‌బీర్ ని యానిమ‌ల్ గా ఆవిష్క‌రిస్తున్నాడు. ఇది తండ్రి కొడుకుల మ‌ధ్య అనుబంధం ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో సాగే ఇంటెన్స్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఇందులో ర‌ష్మిక పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే త‌న కెరీర్ కి ఇవేవీ స‌హ‌క‌రించ‌వ‌ని ఊహిస్తున్నారు. కానీ ఆ రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు సాధిస్తే గ‌నుక తిరిగి అనూహ్యంగా ర‌ష్మిక గ్రాఫ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

11 ఆగస్ట్ 2023న యానిమ‌ల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప2 చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్ లేదా వ‌చ్చే ఏడాది ఆరంభంలో విడుద‌ల‌వుతుంది. ఈ రెండు చిత్రాలు తెలుగు-హిందీ స‌హా బ‌హుభాష‌ల్లో విడుదల కానున్న నేప‌థ్యంలో క్యూరియాసిటీ నెల‌కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.