Begin typing your search above and press return to search.

వీళ్లంతా సీనియ‌ర్ పీకేల్లా ఉన్నారే!

By:  Tupaki Desk   |   22 July 2022 1:30 PM GMT
వీళ్లంతా సీనియ‌ర్ పీకేల్లా ఉన్నారే!
X
బాలీవుడ్ `పీకే` చిత్రంలో అమీర్ ఖాన్ న్యూడ్ పోస్ట‌ర్ అప్ప‌ట్లో ఎంతటి సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఒటిమీద నూలు పోగులేకుండా కేవ‌లం ప్ర‌యివేట్ పార్టు ని ఓ పాతబ‌డిన‌ రేడియోతో క‌వ‌ర్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ పీకేని ఓ రేంజ్ లో పైకి లేపింది. ఇందులో అమీర్ ఖాన్ ఏలియ‌న్ పాత్ర లో భాగంగా ఓసీన్ డిమాండ్ చేయ‌డంతో అలా న‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

సినిమా రిలీజ్ కి ముందు `పీకే` కి అంత బ‌జ్ క్రియేట్ అయిందంటే? కేవ‌లం ఆ ఒక్క పోస్ట‌ర్ కార‌ణం. ఇక రిలీజ్ త‌ర్వాత `పీకే` సృష్టించిన సంచ‌ల‌నాల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ `పీకే` సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా నెట్టింట ఓ పాత పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. ఈ పోస్ట‌ర్ చూస్తే అమీర్ ఖాన్ ని మించిన సీనియ‌ర్ పీకేల్లా క‌నిపిస్తున్నారు వీళ్లంతా కూడా.

సీన్ డిమాండ్ చేయ‌డంతో న్యూడ్ గా న‌టించిన‌ట్లు తెలుస్తోంది. కొంత మంది క‌నీసం అండ‌ర్ వేర్ లో క‌నిపించ‌గా..మ‌రికొంత మంది పీకేస్టార్ లా ప్ర‌యివ్ పార్ట్ ని క‌వ‌ర్ చేస్తూ అడ్డుగా స‌పోర్ట్ తీసుకున్నారు. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ ని చూస్తే పూర్తిగా న‌గ్నంగా క‌నిపిస్తున్నాడు. ఒటిమీద నూలు పోగులేకుండా ప్ర‌యివేట్ పార్ట్ ని చేతితో క‌వ‌ర‌ప్ చేసాడు. మ‌రో ఫోటోలో షాడో తో క‌వ‌ర్ అయింది ఆభాగం.

ఇక ఆదిత్య పంచోలి గోడ చాటు పిల్లిలా చూస్తోన్న ఫోటో చూస్తే .. అంతే న‌గ్నంగా క‌నిపిస్తున్నాడు. వాల్ స‌పోర్ట్ తో క‌వ‌ర‌ప్ చేసాడు. ఇక జాకీ ష్రాప్ ఒక ఫోటోలో పూల్ సైడున అండ‌ర్ వేర్ తో క‌నిపిస్తుండ‌గా..మ‌రో ఫోటోలో కొన్ని గాడ్స్ ని స‌పోర్ట్ గా తీసుకున్నాడు. అలాగే అనీల్ క‌పూర్ ఓ ప్లాంక్ ని అడ్డుగా పెట్టుకున్నాడు.

సీనియ‌ర్ హీరో రంజిత్ కూడా సీన్ డిమాండ్ చేయ‌డంతో అచేధ‌నంగా న‌టించిన‌ట్లు తెలుస్తుంది. అలాగే శ‌క్తి క‌పూర్..అక్ష‌య్ కుమార్ కూడా న్యూడ్ గా క్యామ్ కి ఇచ్చిన ఫో జులు గ‌మ‌నించ‌వ‌చ్చు. మ‌రో ఫోటోలో క‌బీర్ బేడీ బీచ్ లో రిలాక్స్ అవుతోన్న స‌మ‌యంలో అండ‌ర్ వేర్ లో క‌నిపిస్తున్నాడు.

మొత్తానికి వీళ్లంద‌ర్నీ ఇలా చూస్తుంటే అమీర్ ఖాన్ ని మించిన సీనియ‌ర్ పీకేలు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌రి వీళ్లు కూడా అమీర్ త‌ర‌హాలో ఏలియ‌న్ పాత్ర‌లు పోషించారా? అన్న సందేహం రాక మాన‌దు.