Begin typing your search above and press return to search.

అలాంటి వారంతా బాలయ్య అభిమానులే..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 6:30 AM GMT
అలాంటి వారంతా బాలయ్య అభిమానులే..!
X
అల్లు శిరీశ్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. అల్లు హీరో సినిమాకు నందమూరి నట సింహం రావడం అటు అల్లు ఫ్యాన్స్ కి ఇటు నందమూరి ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఈ వేడుకకి వచ్చిన బాలకృష్ణ గురించి అల్లు అరవింద్ మరోసారి తన మాటల్లో చెప్పారు. బాలకృష్ణ గారు ఈ ఈవెంట్ కు రావడం బాగా అనిపించింది. ఆయనతో ఏదైనా 5 నిమిషాలే.. అన్ స్టాపబుల్ టైం లో కూడా ఫోన్ చేసి ఇలా ఒక టాక్ షో మీతో అనుకుంటున్నామని అంటే అయితే టీం ని పంపించండి అని అన్నారు. టీం వెళ్లి షో గురించి చెప్పాక టీం అంతా చాలా బాగున్నారు.. మిగతావి మనం మాట్లాడుదామని అని బాలయ్య చెప్పారని అన్నారు అల్లు అరవింద్.

బాలకృష్ణ గారు ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడుతారు. అంత పెద్ద స్టార్ కదా బిల్డప్ ఇవ్వాలి అనేది అసలు ఉండదు. అందుకే అల్లు శిరీశ్ సినిమా కోసం మీరు వస్తే బాగుంటుందని అడిగితే.. కుర్రాడా.. శిరీశా మనవాడా అయితే ఓకే అని వెంటనే ఓకే చెప్పారని.. అంత సింపుల్ యాటిట్యూడ్ ఉన్న బాలయ్యకి అందరు నిజమైన అభిమానులై ఉండాలని.. ఈ ఈవెంట్ కు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు అల్లు అరవింద్.

సినిమా గురించి ఎక్కువగా చెప్పను.. మూవీ చాలా బాగా వచ్చిందని.. ఇలా ప్రతి నిర్మాత చెప్పేదే కానీ ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు అల్లు అరవింద్. ఈవెంట్ కి వచ్చిన ప్రతి దర్శకుడు తనతో ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంటారు అని.. వచ్చిన దర్శకులందరికి థ్యాంక్స్ అన్నారు అల్లు అరవింద్. అల్లు శిరీశ్ పర్ఫెక్ట్ జూబ్లీ హిల్స్ గాయ్.. అలాంటి అతన్ని ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా డైరక్టర్ రాకేశ్ శశి బాగా చూపించారు.

ఊర్వశివో రాక్షసివో హీరోయిన్ తో పాటుగా మరో రాక్షసి శ్రీదేవి ఉందని.. ఆమె అన్ స్టాపబుల్ మొత్తం మ్యానేజ్ చేఏస్తుందని అన్నారు అల్లు అరవింద్. తమ్మారెడ్డి భరధ్వాజ దగ్గర ఈ కథ తీసుకున్నా.. నేను అడగ్గానే ఆయన ఇచ్చారు.. అందుకు ఆయనకు థ్యాంక్స్. గీతా ఆర్ట్స్ లో ధీరజ్ మరో యువ నిర్మతగా వస్తున్నారని అన్నారు. ఈ సినిమా కోసం బన్నీ వాసు బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తున్నాడని తన కొడుకులతో సమానమైన బన్నీ వాసుకి థ్యాంక్స్ చెప్పి దూరం చేయనని అన్నారు అల్లు అరవింద్.

ఈ సినిమాలో యూత్ ప్రాబ్లెంస్ గురించి ప్రస్థావించారు.. రొమాంటిక్ గా అనిపించినా మంచి ఇండెప్త్ ఉన్న సినిమా ఇదని అన్నారు. సినిమా గురించి ఇంకా ఎక్కువగా సక్సెస్ మీట్ లో మాట్లాడుతానని అన్నారు అల్లు అరవింద్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.