Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ ఫ్యామిలీలో అన్నీ ల‌వ్ మ్యారేజీలే

By:  Tupaki Desk   |   1 May 2022 1:30 AM GMT
ఈ హీరోయిన్ ఫ్యామిలీలో అన్నీ ల‌వ్ మ్యారేజీలే
X
మాస్ కా దాస్ వివ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన చిత్రం 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం'. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ వీ సీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర సంయుక్తంగా నిర్మించారు. తెలంగాణ అబ్బాయి - ఆంధ్రా అమ్మాయి నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్య‌పేట‌లో వ‌డ్డీ వ్యాపారం అర్జున్ ఏజ్ బార్ క‌ష్టాల స‌మాహారంగా ఆద్యంతం న‌వ్వులు పూయించే చిత్ర‌మిది.

ఇటీవ‌ల వ‌రుస‌గా మూడు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్ గా మే 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే చిత్ర బృందం ఈ మూవీ ట్రైల‌ర్ ని విడుద‌ల చేసింది. ఇందులో తెలంగాణ ఫ్యామిలీ, ఆంధ్రా ఫ్యామిలీ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. పెళ్లి కోసం అర్జున్ కుమార్ ప‌డే పాట్లు ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసింది. ఇందులో బాగంగా శ‌నివారం మీడియాతో ముచ్చ‌టింది హీరోయిన్ రుక్సార్ థిల్లాన్‌.

ఈ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది. అంతే కాకుండా పెళ్లిపై త‌న‌కున్న ప్ర‌త్యేక ప్లాన్ ని, తెలుగులో ఎవ‌రెవ‌రితో క‌లిసి న‌టించాలి.. ఏ డైరెక్ట‌ర్ తో క‌లిసి సినిమా చేయాల‌ని వుండో బ‌య‌ట‌పెట్టేసింది. 'ఆక‌తాయి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ సోయ‌గం బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. త‌ను ఎదురుచూస్తున్న బ్రేక్ 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం'తో ల‌భిస్తుంద‌ని ఫుల్ కాన్ఫిడెంన్స్ తో వుంది.

ఈ సంద‌ర్భంగా పెళ్లి, త‌న‌కు కాబోయే వ్య‌క్తి ఎలా వుండాల‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పింది.త‌నకు ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం అంటే నే ఇష్ట‌మ‌ని, త‌న ఫ్యామిలీలో అత్య‌ధిక శాతం ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లేన‌ని చెప్పి షాకిచ్చింది.

అంతే కాకుండా తను ప్రేమించే వాడు ఎలా వుండాలో కూడా స్ప‌ష్టం చేసింది. వ్య‌క్తి ఎలా వున్నాడు అన్న‌ది ముఖ్యం కాదు అని, న‌న్ను, నా ఫ్యామిలీని గౌర‌వించేవాడు అయితే చాల‌ని చెప్పింది. అర్థం చేసుకునేవాడు, ఇత‌రుల‌ని ప్రేమించే వాడైతే మ‌రీ మంచిదని చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ లో ఎవ‌రితో క‌లిసి ప‌నిచేయాల‌ని వుంద‌ని అడితే.. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని వుంద‌ని, 'పుష్ప‌' చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు న‌న్నెంత‌గానే ఆక‌ట్టుకుంద‌ని తెలిపింది. మంచి ప్రేమ‌క‌థ కుదిరితే.. ఆయ‌న త‌న‌కు ఆఫ‌ర్ ఇస్తే సుకుమార్ తో సినిమా చేస్తానంటోంది. ఇక హీరోల్లో ఎవ‌రిలో క‌లిసి న‌టించాల‌ని వుంద‌ని అడిగితే చాలా పెద్ద లిస్టే బ‌య‌ట‌పెట్టిన రుక్సార్ అంద‌రికంటే ముందు అల్లు అర్జున్ తో వ‌ర్క్ చేయాల‌ని వుంద‌ని, ఆయ‌న సినిమాలో ప్రాధాన్య‌త వున్న చిన్న పాత్ర ల‌భించినా న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చింది.