Begin typing your search above and press return to search.
అంతా బాగానే ఉన్నా.. లుక్కేంటి భాయ్?
By: Tupaki Desk | 8 April 2023 4:00 PM GMTసల్మాన్ ఖాన్ హీరో గా హిందీలో తెరకెక్కిన మూవీ కిసికి భాయ్ కిసికా జాన్. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించాడు. కంప్లీట్ గా సౌత్ ఇండియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ తెరకెక్కడం విశేషం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడీగా పూజా హెగ్డే నటించింది. ఇక వెంకటేష్ చెల్లెలు పాత్రలో ఆమె కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్ తెలుగు ప్రేక్షకులకి భాగా రీచ్ అయ్యింది.
మొదటి సారి హిందీ సినిమాలో ఒక తెలుగు పాట పెట్టడం ఈ సినిమాలోనే జరిగింది అని చెప్పాలి. ఇక రామ్ చరణ్ కూడా ఓ సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో కలిసి డాన్స్ చేయడం విశేషం. ఇక పూజా హెగ్డే సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది. ఇలా తెలుగు యాక్టర్స్ సినిమాలో ఉండటం వలన మన దగ్గర కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.
అయితే ఈ సినిమా ట్రైలర్ ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసి కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ పోస్టర్ లో పూజా హెగ్డే క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తూ ఉంది. దానికి విరుద్ధంగా సల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ తో కళ్ళజోడు పెట్టుకొని డిఫరెంట్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్ డాన్స్, లుక్స్ విషయంలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఈ మూవీ నుంచి వచ్చిన ఒక సాంగ్ లో ఇదే లాంగ్ హెయిర్ తో సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్పులు మీమ్స్ క్రియేట్ చేసేవారికి ఫుల్ మీల్స్ అందించాయి. ఆ విజువల్స్ ని యూజ్ చేసి విపరీతంగా మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇలా మీమ్స్ క్రియేటర్స్ కి మరోసారి పని అందించింది. ఇప్పటికే ఈ పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై ఎన్ని మీమ్స్ వస్తాయనేది చూడాలి. సల్మాన్ ఖాన్ అభిమానులకి కూడా ఈ లాంగ్ హెయిర్ లుక్ నచ్చడం లేదనే మాట వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.