Begin typing your search above and press return to search.
పైడిపల్లి ఇంకా అదే హోప్ తో ఉన్నాడా?
By: Tupaki Desk | 3 March 2020 7:45 AM GMTమహేష్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి స్నేహం కట్ అయినట్టేనా? ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనగానే అందరిలో డౌట్ ఇదే. అయితే అక్కడ సీన్ అలా లేదని అర్థమవుతోంది. ఆ ఇద్దరిదీ సినిమా కలిపిన బంధం. మహర్షి సినిమా కలిపింది. సక్సెస్ ఇద్దరి మధ్య బాండింగ్ ని మరింత స్ట్రాంగ్ చేసింది. అప్పటి నుంచి వంశీ మహేష్ ని వదలకుండా తన వెంటే తిరిగాడు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాలు ఒకే ఫ్యామిలీలా కలిసి మెలిసి మెలిగాయి. మహేష్ ఇంటికి వంశీ పైడిపల్లి సతీసమేతంగా వెళ్లడం.. ప్రతిగా మహేష్ సతీ సమేతంగా వంశీ ఇంటికెళ్లడం .. కలిసి విదేశాలు టూర్లు వెళ్లడం..పండగలు..పబ్బాలు జరుపుకోవడం..గుడులు గోపురాలు తిరగడం ఇవన్నీ స్నేహానికి సింబాలిక్ గా నిలిచాయి. ఒకటేమిటి ఇలా ఏ వేదిక అయినా కలిసే పంచుకున్నారు.
ఈ ప్రాసెస్ లోనే మళ్లీ వంశీతోనే మహేష్ సినిమా అన్న ప్రకటన వచ్చాకా.. సడెన్ గా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎక్కడైనా చిన్నపాటి మనస్పర్ధలు రావడం సహజం. అలాగే ఈ రెండు కుటుంబాల మధ్య కూడా అలాంటివి చోటు చేసుకున్నాయని సోషల్ మీడియా లో కథనాలు వేడెక్కించాయి. కతికితే అతకదంటారు అన్న కామెంట్ వినిపించింది. అయితే ఇక్కడ సీన్ మాత్రం రివర్స్ లో ఉంది. పైడిపల్లి ఆ ఇన్సిడెంట్ తర్వాతా మహేష్ ని విడువలేదనే అర్థమవుతోంది. మొన్న జయసుధ కుమారుడు వివాహ రిసెప్షన్ కు మహేష్ సతీమణి నమ్రత తో పాటుగా పైడిపల్లి హాజరయ్యారు.
వంశీ పైడిపల్లి సతీసమేతంగా ఈ వేడుకకు విచ్చేసాడు. అక్కడ నమ్రత తారసపడటంతో చాలా సేపు మాట్లాడుకున్నారు. వంశీతో పాటు...ఆయన భార్య కూడా నమ్రతతో కలిసి చాలా సేపు నవ్వుతూ సమయం గడిపారు. మూతి బిగింపులు కానీ మాడ్చుడు ముఖాలు కానీ కనిపించలేదు. మునుపటిలానే స్నేహంగానే మెలిగారని.. రిసెప్షెన్ ని బాగానే ఎంజాయ్ చేసారని ఆన్ ది స్పాట్ లో ఉన్న కొంత మంది మాట్లాడుకోవడం విశేషం. కతికినా వీళ్ల మధ్య బాగానే అతికిందని చమత్కరించారు కొందరైతే. అంటే పైడిపల్లి ప్రాజెక్ట్ ఇప్పటికి వాయిదా పడింది తప్ప క్యాన్సిల్ కాలేదని భావించాల్సి ఉంటుంది. ఈ ఫోటో చూడగానే ఇప్పటికీ మహేష్ కోసం పైడిపల్లి ట్రై చేస్తున్నాడనే భావించాల్సి ఉంటుంది. ఇక ఇంతకు ముందు మహేష్ కాదనగానే సుకుమార్ డైరెక్టు గా వెళ్లి బన్నీతో ప్రాజెక్టును ప్రకటించినట్టుగా ఈసారి జరగలేదు. మహేష్ ఇలాంటి స్నేహితులనే నమ్ముతారు అందుకే!