Begin typing your search above and press return to search.

కొణిదెల ప్రొడక్షన్స్ కంగారుపడక్కర్లేదు!!

By:  Tupaki Desk   |   2 Jan 2017 4:56 AM GMT
కొణిదెల ప్రొడక్షన్స్ కంగారుపడక్కర్లేదు!!
X
ఆల్రెడీ ఆడియో ఫంక్షన్ మానేశారు.. ఇప్పుడు ఫర్ సప్పోజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయకపోతే ఏమవుతుంది? మెగాస్టార్ చిరంజీవి నుండి ఇతర గెస్టుల వరకు పేజీల పేజీల స్పీచులు ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఏదన్నా ఈవెంట్ చేసినా కూడా.. అక్కడి మాటలను జనాలు రెండు రోజుల్లో మర్చిపోతారు.. మరి దాని వలన సినిమాకు ప్రమోషన్ అవ్వడం అవ్వకపోవడం అనేదేమైనా ఉంటుందా?

మామూలు హీరోల విషయంలో ఏమో గాని.. మెగాస్టార్ చిరంజీవి వంటి ఉద్దండులకు మాత్రం.. సినిమాను ప్రమోట్ చేసినా చేయకపోయినా.. ఇలాంటి ఫంక్షన్లను పెట్టినా పెట్టకపోయినా కూడా పెద్ద తేడా ఏం ఉండదు. ఆల్రెడీ ఖైదీ నెం 150 పాటల లిరికల్ వీడియోలు యుట్యూబ్ లో చేస్తున్న రచ్చ చూస్తుంటే.. ఈ సినిమా కోసం జనాలు ఏ రేంజులో వెయిటింగ్ అనే విషయం తెలుస్తోంది. ఆ తరువాత టివిల్లో యాడ్లు.. రోడ్ల మీద పోస్టర్లు.. ఎనలేని క్రేజ్ తెచ్చేశాయి. ఇప్పుడు ఏదో ఒక రోజు చూసుకుని ట్రైలర్ రిలీజ్ చేస్తే.. ఆ రచ్చ డబుల్ అవుతుంది. సో.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగినా జరగకపోయినా కూడా.. చిరంజీవి 150వ సినిమాకు క్రేజ్ మాత్రం బాగానే ఉంటుంది కాబట్టి.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అస్సలు కంగారుపడక్కర్లేదు అంటున్నారు సినిమా లవర్స్.

ఇకపోతే చాలా రోజుల తరువాత పూర్తి స్థాయి హీరోగా తిరిగి సినిమాల్లోకి వస్తున్న చిరంజీవి.. ఒకవేళ ఈవెంట్ ను సింపుల్ గా చేసినా కష్టమే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌ తో సహా మెగా హీరోలందరూ అక్కడికి రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఎవ్వరు మిస్సయినా కూడా మళ్ళీ క్రిటిసిజంతో నెగెటివ్ కామెంట్లతో ఇబ్బందిపడాల్సిందే. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/