Begin typing your search above and press return to search.

ఉప్పెన ప్రివ్యూలో `ఆర‌డుగుల బుల్లెట్టు` పైనే క‌ళ్ల‌న్నీ!

By:  Tupaki Desk   |   13 Feb 2021 5:30 PM GMT
ఉప్పెన ప్రివ్యూలో `ఆర‌డుగుల బుల్లెట్టు` పైనే క‌ళ్ల‌న్నీ!
X
ఇటీవ‌లే నిహారిక పెళ్లి వేడుక‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న వార‌సుడు అఖీరానంద‌న్ స‌హా క‌నిపించారు. ఆ వేడుక‌లో అఖీరానే సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాడు. 6.2 ఎత్తుతో ఆజానుబాహుడిలా క‌నిపించే అఖీరా తీరైన రూపం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. భవిష్య‌త్ సూప‌ర్ స్టార్ ల‌క్ష‌ణాల‌న్నీ అత‌డిలో క‌నిపించాయి. ప్ర‌తిసారీ అత‌డు ఎక్క‌డ ఉన్నా క‌ళ్ల‌న్నీ త‌న‌పైకే వెళ‌తాయి.

ఇప్పుడు మ‌రోసారి ఉప్పెన ప్రివ్యూలోనూ అఖీరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. నిన్న సాయంత్రం హైద‌రాబాద్ లో ఉప్పెన ప్రివ్యూకి మెగా ఫ్యామిలీ అంతా ఎటెండ్ కాగా అంద‌రితో పాటు అఖీరా - ఆద్య అక్క‌డ క‌నిపించారు. సురేఖా చిరంజీవి- నిహారిక- ఆద్య-- వైష్ణవ్ తేజ్ .. వీళ్ల‌తో పాటు అఖీరా క‌నిపించాడు. అందులో అత‌డే హైలైట్.

అఖీరా టీనేజీలో అడుగుపెట్టాడు. తండ్రి పోలిక‌లు అత‌డికి పెద్ద అడ్వాంటేజ్. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టి నుంచే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క‌ళ్ల‌న్నీ అత‌డిపైనే ఉన్నాయి. అడివి శేష్ న‌టిస్తున్న మేజ‌ర్ లో అతిథి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతున్నా దానికి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. అఖీరా డెబ్యూ ఘ‌నంగా ఉండాల‌ని ప‌వ‌న్ అభిమానులు ఆశిస్తున్న క్ర‌మంలో అత‌డి రంగ ప్ర‌వేశం ఎలా ఉంటుందోన‌న్న ఉత్కంఠ ఉంది.

ఇక ఉప్పెన చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంది. తొలి రోజు 10 కోట్ల షేర్ తో డెబ్యూ హీరోల్లో రికార్డుల్ని బ్రేక్ చేశాడు వైష్ణ‌వ్. తొలి వీకెండ్ నాటికే ఈ మూవీ సేఫ్ కానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.