Begin typing your search above and press return to search.

అంత ఆత్రం ఎందుకు అని ఆయ‌న అన్న‌ట్టుగానే..!

By:  Tupaki Desk   |   25 Jun 2020 4:30 AM GMT
అంత ఆత్రం ఎందుకు అని ఆయ‌న అన్న‌ట్టుగానే..!
X
ప్ర‌భుత్వాల నుంచి షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించినా .. మహమ్మారి నుంచి అనుమ‌తి ల‌భించ‌లేదు. మ‌హ‌మ్మారీ ఎంత మాత్రం క‌నికరించ‌డం లేదు. ముఖ్యంగా హైద‌రాబాద్ మెట్రో న‌గ‌రాన్ని షేక్ చేస్తోంది. రోజుకు 800-900 పాజిటివ్ కేసుల‌తో హైద‌రాబాద్ అట్టుడుకుతోంది. మునుముందు ఈ సంఖ్య అమాంతం పెరుగుతుంద‌నే అంచ‌నా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో షూటింగులు చేయాలా వ‌ద్దా?

నిరంత‌రం 50 మంది సెట్స్ కి రావాల్సి ఉంటుంది కాబ‌ట్టి అంత‌మందిలో మహమ్మారి నియంత్ర‌ణ సాధ్య‌మేనా? అంటే అసాధ్యం అన్న భావ‌న నెల‌కొంది. మెగాస్టార్ చిరంజీవి- నాగార్జున - వెంక‌టేష్ లాంటి అగ్ర తార‌లు ప్ర‌స్తుతం వేచి చూసే ధోర‌ణి లోనే ఉన్నారు. సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ ఎవ‌రూ సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఆర్.ఆర్.ఆర్ హీరోలు తార‌క్- రామ్ చ‌ర‌ణ్ కి కూడా జ‌క్క‌న్న క్లియ‌రెన్స్ ఇచ్చేశారు. ఇప్ప‌ట్లో షూటింగ్ ఉండ‌ద‌ని. మ‌హేష్- ప్ర‌భాస్ లాంటి స్టార్లు ఇంకా వెయిటింగ్ అన్న ధోర‌ణితోనే ఉన్నారు.

ఇలాంటి స‌న్నివేశంలో ప‌రిశ్ర‌మ‌లో ఒక పిల్ల‌ర్ అయిన‌ న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఏం చేస్తున్న‌ట్టు? షూటింగుల‌కు వెళుతున్నారా? అంటే ఇత‌రులు ఏం చేస్తున్నార‌న్న‌దానిపైనా ఆయ‌న రివ్యూలు చేశార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ అగ్ర హీరోలు ఎవ‌రూ సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా లేర‌ని ఆయ‌న గ్ర‌హించారు. అయితే షూటింగుల అనుమ‌తుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఇరు ప్ర‌భుత్వాల్ని క‌లిసిన‌ప్పుడు బాల‌య్య వేసిన కౌంట‌ర్ల గురించి తెలిసిందే. త‌న‌ని పెద్ద‌లంతా విస్మ‌రించార‌ని ఆరోపించారు. అయినా కొవిడ్ విజృంభిస్తుంటే ఇప్పుడే అంత ఆతుర‌త‌ ఎందుకు? అని ఆయ‌న అన్నారు. ఇప్పుడు ఆయ‌న అన్న‌ట్టే అయ్యింది అంతా!! అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇప్పుడు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. అంద‌రి ఆత్రానికి మ‌హ‌మ్మారీ చెక్ పెట్టేసింద‌లా.