Begin typing your search above and press return to search.
యూట్యూబ్ లో నంబర్ -1 గాయని ఎవరు?
By: Tupaki Desk | 24 Jan 2023 6:00 PM GMTచోలీ కే పీచే క్యా హై - ఖల్ నాయక్ (జానపదం) లో ఈ పాట పాడింది ఎవరు? అంటే యువతరం ఠకీమని చెప్పేస్తారు అల్కా యగ్నిక్ అని.
మాధురీ దీక్షిత్ - సంజయ్ దత్ నటించిన ఈ ఐకానిక్ పాట ఇప్పటికీ యూత్ ఫేవరెట్ సాంగ్. ఎంతో శ్రావ్యంగా అలరించే జానపద పాట ఇది. నేటి తరంలో ఐటెం సాంగ్! అంటారేమో కానీ ఇది ఒక క్లాసిక్ గీతం. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరిచిన ఈ పాటకు అల్కా యాగ్నిక్ గానం ఎంతో ఎనర్జీని ఇచ్చింది. ఇప్పటికీ ఈ పాట పాడిన గాయని యూట్యూబ్ లో నంబర్ 1 అంటే నమ్మగలరా?
యూట్యూబ్ లో గాయనీగాయకులకు ఉండే ఫాలోయింగ్ అసాధారణం. నేటితరం చాలా వేగంగా యూట్యూబ్ డిజిటల్ మాధ్యమాల వేదికపై దూసుకుపోతున్నారు. అయితే సీనియర్ గాయణీమనుల్లో ఆల్కా యాగ్నిక్ గత వరుస మూడు సంవత్సరాలుగా యూట్యూబ్ లో స్థిరంగా రాణిస్తున్న గాయనిగా రికార్డులకెక్కారు. ఆల్కా యాగ్నిక్ 2022లో యూట్యూబ్ లో అత్యధికంగా స్ట్రీమింగ్ లను సంపాధించిన పాపులర్ గాయనిగా అవతరించింది.
గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం అల్కా యాగ్నిక్ గత సంవత్సరం 15.3 బిలియన్ యూట్యూబ్ స్ట్రీమ్ లను సంపాదించారు. సగటున రోజుకు 42 మిలియన్లు.. ఇది అసాధారణమైన ఫీట్.. 2021లో 17 బిలియన్ స్ట్రీమ్ లు.. 2020లో 16.6 బిలియన్ల స్ట్రీమ్ లతో అగ్ర స్థానంలో నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా గాయని అల్కా యూట్యూబ్ లో స్థిరంగా రాణిస్తోంది.
మరోవైపు 2022లో యూట్యూబ్‌లో 14.7 బిలియన్ స్ట్రీమ్ లతో బ్యాడ్ బన్నీ (ప్యూర్టో రికో) రెండవ స్థానంలో నిలిచింది. 10.8 బిలియన్లతో ఉదిత్ నారాయణ్ మూడో స్థానంలో నిలవగా.. 10.7 బిలియన్లతో అరిజిత్ సింగ్ నాలుగో స్థానంలో నిలలిచారు. 9.09 బిలియన్లతో కుమార్ సాను ఐదో స్థానంలో నిలిచారు.
అల్కా యగ్నిక్ టాప్ 4 సాంగ్స్
ఏక్ దో తీన్ - తేజాబ్ (డ్యాన్స్)
తేజాబ్ నాటి మేటి క్లాసిక్ చిత్రం. ఏక్ దో తీన్ .. అంటూ అల్కా యాగ్నిక్ మొదటి `హిట్` పాటగా రికార్డులకెక్కింది. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ కంపోజ్ చేసిన ఈ పాట భారతదేశంలోని ప్రతి ఫంక్షన్ లో ప్లే చేయబడిన ఒక హుషారైన గీతం.మాధురీ దీక్షిత్ కి ఫస్ట్ బిగ్ బ్రేక్ ఈ పాటతోనే. ఈ పాటకు అల్కా యాగ్నిక్ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.
చిట్కా చిట్కా బర్సా పానీ - మొహ్రా (కోరిక)
అల్కా గానంలో విజు షా స్వరపరిచిన ఈ పాట విడుదలైనప్పుడు సంచలనంగా మారింది. అక్షయ్ కుమార్ - రవీనా టాండన్ రెయిన్ సాంగ్ ఇది. హిందీ సినిమాలలో హాటెస్ట్ సాంగ్ గా రికార్డులకెక్కింది. ఉదిత్ నారాయణ్ క్లాసిక్ గాత్రానికి అల్కా మ్యాజిక్ పెద్ద రేంజులో వర్కవుటైంది. ఇటీవల ఈ పాటను రీమిక్స్ చేసి ఆధునికీకరించారు. ఒరిజినల్ గాత్రాన్ని అలాగే ఉంచారు!
హమ్ తుమ్ - హమ్ తుమ్ (రొమాంటిక్)
ఏ కాలానికైనా `పర్ఫెక్ట్` రొమాంటిక్ పాట ఒకటి ఉంది అంటే అది జతిన్-లలిత్ స్వరపరచిన బాబుల్ సుప్రియోతో కలిసి అల్కా యాగ్నిక్ పాడిన ఈ పాట. సైఫ్ అలీ ఖాన్ - రాణి ముఖర్జీ జంటగా రొమాన్స్ మెలోడి ఆకట్టుకుంది. ప్రధానమైన స్టాండ్ ఔట్ గాత్రంతో సున్నితమైన వేగవంతమైన ఇన్ స్ట్రుమెంటేషన్ తో నాటి రోజుల్లో యూనిక్ నెస్ తో ఈ రొమాంటిక్ గీతం అలరించింది.
కుచ్ కుచ్ హోతా హై - కుచ్ కుచ్ హోతా హై (యువ ప్రేమ)
అల్కా యాగ్నిక్ - ఉదిత్ నారాయణ్ కాంబినేషన్ లో తొలి పాట ఇది. `తొలి ప్రేమ`లోని తాజాదనానికి నిర్వచనమిది. తొలకరి ప్రేమలో అమాయకత్వాన్ని తెలియజేస్తుంది ఈ పాటలో సాహిత్యం. జతిన్-లలిత్ స్వరపరిచారు. ఇందులో షారుఖ్ ఖాన్- రాణి ముఖర్జీ -కాజోల్ నటించారు. ఆల్కా యాగ్నిక్ ఈ పాటకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తన కెరీర్ లో మర్చిపోలేని పాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.