Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్‌: రోబోగాళ్ పెను విధ్వంశం

By:  Tupaki Desk   |   26 July 2018 7:17 AM GMT
ట్రైల‌ర్‌: రోబోగాళ్ పెను విధ్వంశం
X
ప్రాణం పోసుకున్న ఇనుము మ‌నిషిగా మారితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో శంక‌ర్ మ‌న‌కు `రోబో` చిత్రంలో చూపించారు. ర‌జ‌నీకాంత్ అస‌మాన న‌ట‌ప్ర‌తిభ కాసుల కుంభ‌వృష్టి కురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ - ప్రీక్వెల్ కాని వేరొక రోబోటిక్ సినిమా 2.ఓ శంక‌ర్ నుంచి వ‌స్తోంది అన‌గానే ఒక‌టే ఆస‌క్తి. న‌వంబ‌ర్‌లో 2.ఓ రిలీజ‌వుతోంది. అదంతా అటుంచితే ఒక రోబోకి ప్రాణం పోసి అంద‌మైన అమ్మాయి(అమీ జాక్స‌న్‌)గా మ‌లిచి విల‌న్ వేషాలు వేయిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌తో అమీజాక్స‌న్‌ పాత్ర‌నే క్రియేట్ చేశారు శంక‌ర్‌. నవంబ‌ర్‌ లో లేడీ రోబోట్ విన్యాసాల్ని 2.ఓ చిత్రంలో వీక్షించే వెసులుబాటు ఉంది.

అయితే ఈలోగానే ప్రాణం పోసుకున్న రోబో గాళ్ అరివీర విన్యాసాల‌తో దుమ్ము దులిపేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ ట్రైల‌ర్‌లో వీక్షించ‌వ‌చ్చు. ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ అవ‌తార్ త‌ర్వాత ఆ సిరీస్‌ని కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలానే రోబ‌ర్ట్ రోడ్రిగ్‌తో క‌లిసి భ‌విష్య‌త్ రోబో లేడీ ఎలా ఉండ‌బోతోందో ఓ సినిమా తీస్తున్నాడు. ముందుగా ఓ ట్రైల‌ర్ ద్వారా లేడీ రోబోట్ `అలిటా-బ్యాటిల్ ఏంజెల్‌`ని ఆవిష్క‌రించాడు. రోబో గాళ్ అలిటా పెనువిధ్వంశం - భీక‌ర పోరాటాలు ఎలా ఉంటాయో క‌ళ్లుతిప్పుకోకుండా చూసేంత‌గా ఇదిగో ఈ వీడియోని వ‌దిలాడు. రెండున్న‌ర నిమిషాల ఈ క్లిప్ అల్లాడిస్తోంది. `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌: రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్‌` రైట‌ర్ లింకిన్ పార్క్ సృష్టి ఇద‌ని చెబుతున్నారు. ఇక‌పోతే యుకిటో కిషిరో గ్రాఫిక్ న‌వ‌ల గున్మ్ (Gunnm)నే సినిమాగా తీస్తున్నార‌ట‌. 21 డిసెంబ‌ర్ 2018న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలిటా పాత్ర‌లో రోసా సాల‌జార్ న‌టించారు. లెజెండ్ జేమ్స్ కామెరూన్‌ కి ద‌ణ్ణం పెట్టాల్సిందే ఈ విజువ‌ల్ చూశాక‌!