Begin typing your search above and press return to search.

మహేష్ కోసం 100 కోట్ల బడ్జెట్ తో 'ఏలియన్' మూవీ ప్లాన్ చేశాడట..!

By:  Tupaki Desk   |   24 April 2021 11:00 PM IST
మహేష్ కోసం 100 కోట్ల బడ్జెట్ తో ఏలియన్ మూవీ ప్లాన్ చేశాడట..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ నుండి కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకోకుండా.. కుదిరినప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. అందుకే రచయితలు దర్శకులు మహేష్ ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ప్రయోగాత్మక కథలను రాసుకుంటారు. 'ఢమరుకం' సినిమా స్టోరీ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ కూడా మహేష్ కోసం ఓ ఏలియన్ కాన్సెప్ట్ లో ఒక కథను రాసుకున్నాడని తెలుస్తోంది.

ఇటీవల వెలిగొండ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏలియన్ కాన్సెప్ట్ తో ఓ స్టోరీ లైన్ రాసుకున్నానని.. అప్పటికే 'అరుంధతి' లాంటి భారీ సినిమాలు తీసిన డైరెక్టర్ కోడి రామకృష్ణకు ఆ లైన్ వినిపిస్తే సూపర్ గా బావుందని పూర్తి కథను డెవలప్ చేయమని చెప్పారని శ్రీనివాస్ తెలిపారు. ఆ తర్వాత ఈ స్టోరీ మరో దర్శకుడికి చెప్పగా ఇది మహేష్ బాబుతో చేద్దామని అన్నాడని.. అప్పట్లోనే దానికి 100 కోట్లు బడ్జెట్ అయ్యేదని.. ఇప్పుడు 200 కోట్లు అవుతుందని రచయిత అన్నారు.

అయితే ముందుగా ఒక పెద్ద సినిమా చేసి మహేష్ బాబు దగ్గరకు వెళ్ళాలి అనుకొని 'అఖిల్' కథ రెడీ చేసుకున్నానని.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ధైర్యం చేయలేకపోయినట్లు వెలిగొండ శ్రీనివాస్ చెప్పాడు. అప్పుడే ఆ ఏలియన్ కథను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. నిజానికి 'అఖిల్' కథను రామ్ చరణ్ కోసం రాసుకున్నానని.. అయితే అఖిల్ తో చేసే అవకాశం రావడంతో మార్పులు చేర్పులు చేశానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.