Begin typing your search above and press return to search.

బిడ్డ‌పై అలియాభ‌ట్ అమ్మ ప్రేమ ఓ అద్భుతం!

By:  Tupaki Desk   |   20 Dec 2022 11:30 AM GMT
బిడ్డ‌పై అలియాభ‌ట్ అమ్మ ప్రేమ ఓ అద్భుతం!
X
బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ మాతృమూర్తిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి క‌పూర్ ఇంట వారుసురాల్ని అందించింది. ప్ర‌స్తుతం అలియాభ‌ట్ ఇంటి వ‌ద్ద‌నే ఉంటే బిడ్డ ఆలనా పాల‌నా చూసుకుంటుంది. తోడుగా అలియ‌భట్ త‌ల్లి కూడా ఉన్నారు. ఇటీవ‌లే ప్ర‌స‌వం త‌ర్వాత తొలిసారి చెల్లెలు పుట్టిన రోజువేడుక‌ల్లో పాల్గొనేందుకు అలియాభ‌ట్ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఆ స‌మ‌యంలో అలియా మీడియాకి చిక్కారు. దీంతో అలియాభ‌ట్ రూపంలో చాలా ర‌కాల మార్పులు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అలాగే న‌టిగా కొన‌సాగుతానా? లేదా? అన్న‌ట్లు భ‌విష్య‌త్ గురించి చెప్ప‌కనే చెప్పింది.

తాజాగా అలియా భట్ ఫేక్ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇందులో అలియాభ‌ట్ తన బిడ్డ‌కు పాలు అందిస్తున్న‌ట్లు (బ్రెస్ట్ ఫీడింగ్) క‌నిపిస్తున్నారు.

ఇందులో సంప్ర‌దాయ ఆమె చీర‌క‌ట్టుకుని పాపాయికి పాలు అందిస్తోన్న స‌మ‌యంలో అలియా ఆ మాతృత్వాన్నిఆస్వాదిస్తు న్న‌ట్లు క‌నిపిస్తుంది. కానీ ఇది ఫేక్ ఫోటోలా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఇదే నిజ‌మైన ఫోటో అయితే ఎంత బాగుండని అభిమానులు భావిస్తున్నారు. అయినా అమ్మ ప్రేమ‌ను పంచుతోన్న ఆ ఫోటో చూస్తుంటే అలియానే క‌నిపిస్తుంది.

అమ్మ ప్రేమ లో ప్ర‌తీ మూవ్ మెంట్ ఎంతో గొప్ప‌గా.. జీవితాంతం గుర్తిండిపోతుందని.. అందులోనూ ఇలాంటి బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటో? అంటే ఇది అద్భుత‌మ‌నే చెప్పాలి. అలియాభ‌ట్ ఇంకా కుమార్తె ఫోటోల్ని సోష‌ల్మీడియాలో షేర్ చేయ‌లేదు.

ముఖం చూపించ‌కుండా చేతులు..కాళ్లు మాత్ర‌మే క‌నిపించేలా ఓఫోటోని కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసింది. ఆ స‌మ‌యంలో పాపాయికి పేరు పెట్టిన‌ట్లు..ఆ పేరు వెనుక అర్ధం ఏంటి? అని నెటి జ‌నుల్ని అడిగింది. ఇక న‌టిగా అలియాభ‌ట్ చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్న‌సంగ‌తి తెలిసిందే. వాటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని భావిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.