Begin typing your search above and press return to search.

దండాలు సామీ దండాలు! ఇంత‌కీ బ్యాక్ ఫీట్ బ్యూటీ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   23 Dec 2021 7:05 PM IST
దండాలు సామీ దండాలు! ఇంత‌కీ బ్యాక్ ఫీట్ బ్యూటీ ఎవ‌రు?
X
దండాలు సామీ దండాలు! భ‌ట్ మ‌రీ అలా చేతులెత్తి మ‌రీ దండాలు పెడుతోంది ఎవ‌రికీ? అయినా అంత క‌ష్టం ఏం వ‌చ్చింది ఈ అమ్మ‌డికి? ఇంత‌కీ దండాలు పెడుతున్న ఈ నాయిక ఎవ‌రై ఉంటారు? ఇలా ర‌క‌ర‌కాల సందేహాలు.

అన్నిటికీ క్లారిటీ ఇదే. ఇటీవ‌ల క‌పిల్ శ‌ర్మ షో కోసం అటెండ‌యిన ఆలియా భ‌ట్ అలా త‌న అభిమానులకు అభివాదం చేస్తూ కార్ వైపు వెళ్లింది. చుట్టూ సెక్యూరిటీ న‌డుమ ఆలియా ఇలా ఎంతో స‌ర‌దాగా జాలీగా క‌నిపించ‌డమే కాదు.. ఆర్.ఆర్.ఆర్ కి కావాల్సిన ప్ర‌మోష‌న్ చేస్తోంది.

ఇక ఏ వేదిక‌కు వెళ్లినా చిట్టి పొట్టి స్క‌ర్టులు గౌనుల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ ద‌ర్శ‌క‌ధీరుడికి షాక్ లిస్తోంది. ఒక‌సారి చీర‌లో క‌నిపించిన ఆలియా ఆ త‌ర్వాత మాత్రం పూర్తిగా ఇలాంటి అల్ట్రా గ్లామ‌ర‌స్ అవ‌తారాల‌కే ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. తాజాగా ప‌సుపు ప‌చ్చ స్క‌ర్టులో ఆలియా థై సొగ‌సులు ఆవిష్క‌ర‌ణ కుర్ర‌కారుకు మ‌త్తెక్కించింది. అలా వెన‌క ఫీట్ గా బోలెడంత మ్యాజిక్ చేసింది మ‌రి. పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తో ఇప్పుడు ఆలియాకి సౌత్ లో అసాధార‌ణ క్రేజు పెరిగింది. మునుముందు మ‌రిన్ని సౌత్ సినిమాల‌తో ఈ అమ్మడు త‌న ట్యాలెంట్ ని ఆవిష్క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు. తాజాగా ఆలియా షేర్ చేసిన ఈ ఫోటోకి రేంజ్ రోవ‌ర్ కి దండం పెడుతోందా? ఎవ‌రీ క‌న్య‌క ? అంటూ క్విజ్ లు పెడుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ బాలీవుడ్ ప‌టాకా కుడ్డీ? అని అడిగేస్తున్నా గెస్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.