Begin typing your search above and press return to search.

అలియాభ‌ట్ ని హాలీవుడ్ మేక‌ర్స్ ఇబ్బంది పెట్టారా?

By:  Tupaki Desk   |   26 Jun 2023 5:00 AM GMT
అలియాభ‌ట్ ని హాలీవుడ్ మేక‌ర్స్ ఇబ్బంది పెట్టారా?
X
బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ని హాలీవుడ్ మేక‌ర్స్ ఇబ్బంది పెట్టారా? ఒకేప‌ని ప‌దే ప‌దే చేయించారా? ప‌ర్పెక్షన్ లోపంతోనే ఇలా జ‌రిగిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. అలియాభ‌ట్ హార్ట్ ఆఫ్ స్టోన్` తో హాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అలియా ఎంత‌గా శ్ర‌మించిందో తెలిసిందే. ఏప్రిల్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ తో వివాహం త‌ర్వాత జూన్ లో అలియాభ‌ట్ గ‌ర్వం దాల్చిన సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే అలియాభ‌ట్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యంతో ముందుకు క‌దిలింది.

గ‌ర్భంతోనే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంది. అందులోనూ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌డం విశేషం. అలాంటి స‌మ‌యంలో రిస్కీ స‌న్నివేశాలు చేయ‌డం ప్ర‌మాద‌ర‌క‌ర‌మ‌ని తెలిసినా అలియాన వెన‌క్కి జ‌క్క‌కుండా షూట్ ని పూర్తిచేసింది. హాలీవుడ్ ఛాన్స్ వ‌దులుకోవ‌డం ఇష్లం లేక‌నే క‌ష్ట‌మైనా ప‌నిచేసిన‌ట్లు తెలిపింది. అయితే షూట్ స‌మ‌యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకునే చేసింది.

టీమ్ ముందుగానే సెట్స్ లో అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసి పెట్టేవారు. స్పాట్ లో డాక్ట‌ర్లు..అంబులెన్స్ లు..ఎమెర్జెన్సీ ప‌రిస్థితులు వ‌స్తే స్పందించేలా అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసారు. అలా విజ‌యవంతంగా అలియా భ‌ట్ యాక్ష‌న్ పార్టు షూట్ పూర్తిచేసింది. అయితే ఇదంతా ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అప్ డేట్ . ఆత‌ర్వాత అలియాభ‌ట్ నెల‌లు నిండిన స‌మ‌యంలోనూ షూటింగ్ లొ పాల్గొంది అన్న విషయంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

కొన్ని స‌న్నివేశాలు స‌రిగ్గా రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ చిత్రీక‌ర‌ణ కోసం మ‌రికొన్ని రోజులు కేటాయించాల్సి వ‌చ్చిందిట‌. ఆయా స‌న్నివేశాలు పోర్చుగ‌ల్ లో చిత్రీక‌రించిన‌ట్లు తెలిసింది. ఈ విష‌యాన్ని అలియాభ‌ట్ తండ్రి మ‌హేష్ భ‌ట్ కూడా ధృవీక‌రించారు. ఆ స‌మ‌యంలో అలియా కాస్త అసౌక‌ర్యానికి గురైన‌ట్లు తెలిపారు. అయితే హాలీవుడ్ పై త‌న‌కున్న ఫ్యాష‌న్ క‌న్నా! అసౌక‌ర్యం పెద్ద‌గా ఇబ్బందిగా అనిపించి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.