Begin typing your search above and press return to search.

షాకింగ్ : త‌ల్లి కాబోతున్న అలియాభ‌ట్

By:  Tupaki Desk   |   27 Jun 2022 7:04 AM GMT
షాకింగ్ : త‌ల్లి కాబోతున్న అలియాభ‌ట్
X
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భ‌ట్ .. ఇటీవ‌ల రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిస్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మ‌ల్టీస్టార‌ర్ 'RRR' మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. పాత్ర నిడివి చాలా త‌క్కువే అయినా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో సీత పాత్ర‌లో ఆక‌ట్టుకుని ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది.

తెలుగులో చేసిన తొలి చిత్ర‌మే పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో అలియాభ‌ట్ ని మ‌రిన్ని తెలుగు సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేశారు.

అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ అలియాభ‌ట్ క్రేజీ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ ని వివాహం చేసుకుంది. హ‌నీమూన్ ని కూడా ప్లాన్ చేసుకోని అలియా భ‌ట్‌ తెలుగులో ప్ర‌పోజ‌ల్ లో వున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. ఇదిలా వుంటే సోమ‌వారం అలియా భ‌ట్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పెట్టిన పోస్ట్‌, ఫొటోలు ఆమె అభిమానుల్ని షాక్ కు గురిచేశాయి. అలియా సోమ‌వారం షాకింగ్ స్యూస్ ని వెల్ల‌డించి అంద‌రిని విస్మ‌యానికి గురిచేసింది.

తాను త‌ల్లిని కాబోతున్నాన‌ని, త్వ‌ర‌లోనే మా బేబీ వ‌స్తోందంటూ త‌ను షేర్ చేసిన ఫొటో కు క్యాప్ష‌న్ ఇచ్చి త‌న ప్రెగ్నేన్సీ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. హాస్పిట‌ల్ బెడ్ పై ప‌డుకుని కంప్యూట‌ర్ స్క్రీన్ పై త‌న గ‌ర్భాన్ని చూసుకుంటూ అలియా క‌నిపించింది. ప‌క్క‌నే ర‌ణ్ బీర్ టోపీ ధ‌రించి క‌నిపించాడు. అలియా భ‌ట్ స్వ‌యంగా షేర్ చేసిన ఈ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ర‌న్ బీర్, అలియా జంట రీసెంట్ గా వివాహం చేసుకుంది. ఏప్రిల్ లో వీళ్ల వివాహం జ‌రిగింది. పెళ్లి త‌రువాత ఈ జంట హ‌నీమూన్ అంటూ ఎలాంటి టూర్ ని ప్లాన్ చేసుకోలేదు. ఎక్క‌డికీ వెల్ల‌లేదు కూడా. ఎవ‌రి సినిమా ప‌నుల్లో వారు గ‌త కొన్ని రోజులుగా బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. పెళ్లై మూడు నెల‌లు తిర‌క్కుండానే అలియా గ‌ర్భ‌వ‌తి కావ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

ఈ విష‌యం తెలిసిన బాలీవుడ్ ప్ర‌ముఖులు ర‌ణ్ బీర్ , అలియా భ‌ట్ ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కృతి స‌న‌న్‌, ర‌కుల్ ప్రీత్‌, క‌ర‌ణ్ జోహార్‌, టైగ‌ర్ ష్రాఫ్ వంటి వారు అలియా జంట‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో వున్నారు. ఇదిలా వుంటే కెరీర్ పీక్స్ లో వున్న ఈ టైమ్ లో అలియా ప్రెగ్నెన్సీని కోరుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మాతృత్వాన్ని ఇంత త్వ‌ర‌గా ఎవ‌రూ కోరుకోరు కానీ అలియా భ‌ట్ మాత్రం వెంట‌నే ర‌ణ్ భీర్ బిడ్డ‌కి త‌ల్లిని కావాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుండ‌టం ఇద్ద‌రి మ‌ధ్య వున్న ప్రేమ‌ని తెలియ‌జేస్తోందిని, ఈ విస‌యంలో అలియా భ‌ట్ గ్రేట్ అని అంతా ప్ర‌వంస‌లు కురిపిస్తున్నారు. అయితే మ‌రి కొంత మంది మాత్రం నిజంగా అలియా ప్రెగ్నెంటా లేక ఏదైనా సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇలా చేస్తున్నారా? అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.