Begin typing your search above and press return to search.

#ఆలియా.. లండ‌న్ హోమ్ -వానిటీ వ్యాన్ స‌హా టాప్ 5 ఖ‌రీదైన‌ ఆస్తులు

By:  Tupaki Desk   |   29 April 2021 2:30 AM GMT
#ఆలియా.. లండ‌న్ హోమ్ -వానిటీ వ్యాన్ స‌హా టాప్ 5 ఖ‌రీదైన‌ ఆస్తులు
X
ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది బాలీవుడ్ న‌టి ఆలియాభ‌ట్. ఈ భామ విలాసాల గురించి ఆస్తుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. బంగ్లాలు కార్ లు విదేశాల్లో సొంత ఇల్లు ప్ర‌తిదీ ల‌గ్జ‌రీనే. లండన్ లోని అల్ట్రా రిచ్ డ్రీమ్ హోమ్ మొద‌లు స్వాంకీ వానిటీ వ్యాన్ వరకు ఆర్.ఆర్.ఆర్ న‌టి అలియా భట్ ఐదు ఖరీదైన కొనుగోళ్ల గురించి తెలుసుకుంటే ఎగ్జ‌యిట్ కాని వారు ఉండ‌రు.

బాలీవుడ్ లో గొప్ప స్టార్ గా వెలిగిపోతున్న‌ అలియా భట్ 28 ఏళ్ళ వయసులో గొప్ప స్థాయికి చేరుకుంది. 28 ఏళ్ల టాలెంటెడ్ ఆలియా హిందీ చిత్ర‌సీమ‌లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. రాజీ - గల్లీ బాయ్- హైవే స‌హా మరిన్ని విజయవంతమైన చిత్రాలను ఆలియా కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు.. ఆలియా అభిమానుల ఫాలోయింగ్ ఇటీవ‌ల ఏకంగా పది రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ విస్త‌రించింది.

ఆలియా కేవలం 28 సంవత్సరాల వయస్సులో లండన్ లాంటి ఖ‌రీదైన న‌గ‌రంలో సొంత ఇంటిని వోన్ చేసుకోవడం నుండి విలాసవంతమైన కార్ల ను సొంతం చేసుకుని న‌గ‌రంలో షికార్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ భార్య గౌరీ ఖాన్ స్వ‌యంగా అలియా కోసం వానిటీ వ్యాన్ రూపకల్పన చేశారు. ప్రసిద్ధ డిజైనర్ అలియా వానిటీ వ్యాన్ ఇంటీరియ‌ర్ కి సాయం చేశార‌ట‌. ఇది క‌దిలే విలాస‌వంత‌మైన గృహం. ఆలియా ఫుల్ హ్యాపీగా ఉండే ముంబై అపార్ట్ మెంట్ ఎంతో విలాస‌వంత‌మైన‌ది.

ఒక అపార్ట్ మెంట్ ఉన్నా కానీ అలియా ముంబైలోని జుహులో వేరొక అంద‌మైన అపార్ట్ మెంట్ ని కలిగి ఉన్నట్లు తెలిసింది. దీని కోసం ఆమె 13.11 కోట్ల రూపాయలను వెచ్చించింది. 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది.ఆమె దానిని షాహీన్ భట్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఆమెకు సొంత సంతోషకరమైన ప్రదేశం. ఈ ఇంటిని ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు చూడవచ్చు. ఇదేగాక‌.. అలియాకు కూడా 2460 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ వేరొక‌టి ఉంది. ప్రియుడు రణబీర్ కపూర్ మాదిరిగానే 32 కోట్ల రూపాయలకు ఈ ఇంటిని కొనుగోలు చేసింది.

అలియా తన కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాగులు ఆస్తులలో మాత్రమే కాకుండా నమ్మకమైన బ్రాండెడ్ ఖరీదైన వాహనాలపైనా పెట్టుబడులు పెట్టారు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ & బిఎమ్‌.డబ్ల్యూ 7-సిరీస్ ను కలిగి ఉన్నారు. రేంజ్ రోవర్ వోగ్ ధర 1.88 కోట్ల రూపాయలు కాగా, ..బిఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ విలువ 1.37 కోట్ల రూపాయలు.

2018 లో లండన్లోని కోవెంట్ గార్డెన్లో ఒక అందమైన ఇంటిని కొన్నప్పుడు అది త‌న క‌ల అని ప్ర‌క‌టించారు ఆలియా. ఆ ప్రాంతంలో ఆస్తుల సగటు ప్రారంభ ధర రూ .16 కోట్లకు పైగా ఉందిట‌. ఇప్పుడు దాని విలువ చాలా ఎక్కువ‌.

చానెల్ టు లూయిస్ విట్టన్,.. అలియా ఖరీదైన బ్యాగుల‌ను సేక‌రించే అల‌వాటును క‌లిగి ఉంది. అలియా తన గది నుండి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేప్పుడు చాలా ఖరీదైన హ్యాండ్ బ్యాగుల‌ను ఉప‌యోగిస్తుంది.

బాలెన్సియాగా,.. చానెల్ .. సెయింట్ లారెంట్ వంటి బ్రాండ్లు తరచుగా అలియా వేషధారణతో కనిపిస్తాయి. ఏదేమైనా.. తన కొనుగోళ్ల‌లో అత్యంత ఖరీదైన కొనుగోలు లూయిస్ విట్టన్ బ్యాగ్. ఈ స్టైలిష్ బ్యాగ్ ధర సుమారు రూ .1.74ల‌క్ష‌లు. ఇలాంటి ఖ‌రీదైన ఆస్తులెన్నో త‌న సొంతం చేసుకుంది ఆలియా.