Begin typing your search above and press return to search.

ఆలియా- SRK సినిమా ఓటీటీలోనా..?

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:36 AM GMT
ఆలియా- SRK  సినిమా ఓటీటీలోనా..?
X
బాలీవుడ్ ట్యాలెంటెడ్ గాళ్ ఆలియాభ‌ట్ వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ లో న‌టించింది. అలాగే సంజ‌య్ లీలా భ‌న్సాలీతో గంగూభాయి క‌థియావాడీ చిత్రంలో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించింది. ఇవి రెండూ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే బ్ర‌హ్మాస్త్ర లాంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప్రియుడితో జ‌త‌క‌ట్టింది. ఈ మూవీ కూడా విడుద‌ల కావాల్సి ఉంది.

ఇంత‌లోనే ఆలియా న‌టించిన డార్లింగ్స్ ఓటీటీలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని షారూక్ తో క‌లిసి ఆలియా స్వ‌యంగా నిర్మించింది. త‌నే ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. అయితే ఈ మూవీని ప్ర‌స్తుత క్రైసిస్ ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని ఇప్పటికే డీల్ ఫైన‌ల్ అవుతోంద‌ని స‌మాచారం.

ఇంత‌కుముందు డార్లింగ్స్ ర్యాప్ అప్ పార్టీ నుండి ఫోటోలను షేర్ చేసింది షెఫాలీ షా. దర్శకుడు జస్మీత్ కె రీన్ .. సహ-నటులు విజయ్ వర్మ - రోషన్ మాథ్యూ ఇతర నటీనటులు సిబ్బందితో షెఫాలీ - అలియా భట్ ఆ క్షణాన్ని ఆస్వాధిస్తూ క‌నిపించారు. షెఫాలీ షా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడం ద్వారా డార్లింగ్ చిత్రీక‌ర‌ణ‌ ముగింపు వేడుకలు గ్రాండ్ గా జ‌రిగాయి.

న‌టి షెఫాలీ తన సహనటులకు .. చిత్ర బృందానికి వీడ్కోలు పలికినందుకు తన బాధను వ్యక్తం చేసింది. ``ఏదీ నన్ను వీడ్కోలు కోసం సిద్ధం చేయదు.. అని క‌ల‌త చెందింది. వెబ్ సిరీస్ లు - ఢిల్లీ క్రైమ్ - అజీబ్ దాస్తాన్స్ వంటి చిత్రాలలో తన నటనకు ఆలస్యంగా ప్రశంసలు పొందిన షెఫాలీ “మరో ర్యాప్ ఏదీ నన్ను వీడ్కోలు కోసం సిద్ధం చేయదు #ShootWrap” అనే క్యాప్షన్ ని రాసింది. ఇప్ప‌టికి నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉన్న డార్లింగ్స్ ఓటీటీ లో విడుద‌ల కానుంది.