Begin typing your search above and press return to search.
RRRలో అలియా పాత్ర కుదించలేదు..రాజమౌళే షూటింగ్ కు రావొద్దన్నాడట!
By: Tupaki Desk | 23 Feb 2021 12:30 PM GMTదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గడచిన పది రోజులుగా RRR షూటింగ్ లో అలియా పాల్గొనట్లేదు! దీంతో.. ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అలియా యాక్టింగ్ పై జక్కన్న అసంతృప్తిగా ఉన్నారని, అందువల్ల ఆమె పాత్రను కుదిరించారని ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఈ ప్రచారాన్ని RRR వర్గాలు కొట్టిపారేశాయి. ఆ పుకార్లలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిసింది. అనివార్యా కారణాల వల్ల అలియా భట్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలని స్వయంగా రాజమౌళి కోరారని సమాచారం. దీంతో.. జక్కన్న కోరిక మేరకు RRRకోసం తాను కేటాయించిన డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నారట అలియా.
దీనికి కారణం ఏమంటే.. కొరటాల శివ 'ఆచార్య'లో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ సినిమాలో చెర్రీ పాత్రను మొదట 30 నిమిషాల వరకే అనుకున్నారు. కానీ.. ఆ పాత్ర పరిధిని గంట వరకు పెంచాడట కొరటాల. దీంతో.. చరణ్ ఆచార్య షూట్లో లాక్ అవ్వాల్సి వచ్చింది. దీని కారణంగా.. రాజమౌళి తన చిత్రీకరణను రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట.
రామ్ చరణ్-అలియా భట్ పై రెండు పాటలు షూట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు చెర్రీ ఆచార్యలో బిజీగా ఉన్న కారణంగా.. ఏప్రిల్‌లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడట రాజమౌళి. ఈ కారణంగా.. అలియా డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకోవాలని జక్కన్న కోరడంతో.. ఓకే చెప్పేసిన అలియా, ముంబై వెళ్లిపోయిందట.
ఈ లెక్క ప్రకారం ఏప్రిల్ లో తిరిగి హైదరాబాద్‌కు వస్తారు అలియాభట్. అప్పుడే రామ్ చరణ్ - అలియాభట్ మధ్య వచ్చే సన్నివేశాలు షూట్ చేస్తారు. 'ఆచార్య' మే 14న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అందుకే.. ఈ చిత్రాన్ని వేగంగా తెరకెక్కిస్తున్నారు. RRR అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.