Begin typing your search above and press return to search.

#ఆలియా.. డెలివ‌రీ అయ్యాకే పెండింగ్ షూట్ లు!

By:  Tupaki Desk   |   27 July 2022 2:30 AM GMT
#ఆలియా.. డెలివ‌రీ అయ్యాకే పెండింగ్ షూట్ లు!
X
అందాల ఆలియా భట్ ఏడాదికి నాలుగైదు సినిమాల్లో న‌టించేస్తోంది. ఇంత స్పీడ్ తన స‌మ‌కాలిక క‌థానాయిక‌ల్లో లేదు. పైగా వ‌రుసగా పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ ఇండ‌స్ట్రీ బెస్ట్ పారితోషికంతో దేశంలోనే టాప్ వ‌న్ హీరోయిన్ గా త‌న పేరును సుస్థిరం చేసుకుంది. 2022లో రెండు పాన్ ఇండియా హిట్లు అందుకుంది. ఒక‌టి ఆర్.ఆర్.ఆర్ కాగా రెండోది గంగూభాయి క‌తియావాడీ. ఇవి రెండూ భారీ వ‌సూళ్ల‌తో పాటు ఆలియాకు చ‌క్క‌ని పేరు తెచ్చాయి. త‌దుప‌రి ఇదే ఏడాదిలో బ్ర‌హ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇంత‌లోనే ఆలియా భ‌ట్ త‌న ప్రియుడు ర‌ణ‌బీర్ ని పెళ్లాడేసింది. పెళ్లి అనంత‌రం నెల గ‌డ‌వ‌క ముందే తాను మ‌మ్మీ అవుతున్నాన‌ని కూడా వెల్ల‌డించింది. గ‌ర్భ‌ధార‌ణ‌కు ముందే ఆలియా పెండింగ్ అసైన్ మెంట్ లన్నింటినీ పూర్తి చేసింది. అలియా న‌టించిన‌ తాజా చిత్రం డార్లింగ్స్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ స‌ర‌స‌న న‌టించిన `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`కి సంబంధించి తన టాకీ పార్ట్ ను ముగించింది. ఒక్క పాట మిన‌హా టాకీ మొత్తం పూర్త‌యింది. ఆలియా డెలివరీ తర్వాత ఈ పాట‌ను చిత్రీక‌రిస్తారు. ఈ చిత్రంలో అనన్య పాండే- జాన్వీ కపూర్- సారా అలీ ఖాన్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.

డార్లింగ్స్ తో నిర్మాత‌గా ఆరంగేట్రం

ఆలియా భ‌ట్- షెఫాలీ షా- విజయ్ వర్మ త‌దిత‌రులు న‌టించిన‌ డార్క్ కామెడీ మూవీ డార్లింగ్స్. ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్- అలియా భట్ -గౌరవ్ వర్మ నిర్మించారు. ఆలియాకి నిర్మాత‌గా ఇది తొలి సినిమా. జస్మీత్ కె రీన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డార్లింగ్స్ టీజర్ పోస్టర్ ల‌తో పాటు ట్రైలర్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో 2022 ఆగస్టు 5న ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.

నిజ‌మైన ప్రేమ కోసం వెతుకుతూ.. సంఘంలోని రాక్షసులతో పోరాడుతూ.. ముంబైలో కాలు మోపిన తల్లీ కూతుళ్ల జీవితాల్లో ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఇందులో ముస్లిమ్ యువ‌తిగా ఆలియా న‌టిస్తోంది. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో ఒక యువ‌కుడిని కిడ్నాప్ చేసి చిత్ర‌హింస‌ల‌కు గురి చేసే యువ‌తిగా ఆలియా పాత్ర క్యూరియాసిటీని పెంచింది. ముస్లిమ్ యువ‌తి అయినా మోడ్ర‌న్ యువ‌తి వేష‌ధార‌ణ‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ ఆలియా పాత్ర‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ క్యూరియాసిటీని పెంచాయి.

అలియా భట్ ఈ చిత్రంతో తన సొంత బ్యాన‌ర్ ఎటర్నల్ సన్ షైన్ ని ప్రారంభించి అందులో తొలి సినిమాగా డార్లింగ్స్ ని నిర్మిస్తోంది. ఆలియా మాట్లాడుతూ.. డార్లింగ్స్ నాకు వెరీ స్పెషల్.. నేను స్క్రిప్ట్ చదివిన క్షణం న‌టిగానే కాకుండా పెద్ద‌గా ఇంకేదైనా చేయాల‌నుకున్నాను. ఇలాంటి ప్రత్యేకమైన కథలను ప్రేక్షకులకు అందించడంలో మా అంద‌రి పాత్ర ఉంది. కొంతమంది అద్భుతమైన సహ-నటులు.. భాగస్వామ్య‌ నిర్మాతలు .. ద‌ర్శ‌కుడు జస్మీత్ ల కృషిని గుర్తు చేసుకోవాలి. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ విడుద‌ల‌వుతోంది`` అని తెలిపారు.