Begin typing your search above and press return to search.

అలియా పై వస్తున్న విమర్శలపై ఆమె తల్లి కీలక వ్యాఖ్యలు...!

By:  Tupaki Desk   |   25 Jun 2020 8:50 AM GMT
అలియా పై వస్తున్న విమర్శలపై ఆమె తల్లి కీలక వ్యాఖ్యలు...!
X
'ధోనీ' హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ చేసుకొని మరణించడం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సుశాంత్ మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉండే నెపోటిజం ఫేవరిజం మరియు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే కారణమని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అతనికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేకపోవడం వలన కనీస గౌరవం ఇవ్వలేదని.. అతడిని అన్ని విధాలుగా తొక్కేశారని కామెంట్స్ చేస్తున్నారు. గత ఆరు నెలల్లో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సుశాంత్ ని బ్యాన్ చేయడంతో సైన్ చేసిన ఏడు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సుశాంత్ మరణానికి బాధ్యులను చేస్తూ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి బాలీవుడ్ ప్రముఖులపై పలు ఏరియాల్లో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గతంలో సుశాంత్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కరణ్ జోహార్, సల్మాన్, అలియా భట్, సోనమ్ కపూర్, కరీనా కపూర్ లాంటి వారిపై సోషల్ మీడియా మాధ్యమాల్లో అన్ ఫాలో చేస్తూ వారి సినిమాలను బాయ్ కాట్ చేస్తామని నిరసన తెలుపుతున్నారు.

బాలీవుడ్ లో నెపోటిజం వల్లనే అలియా భట్ హీరోయిన్ అయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అలియా తల్లి, సీనియర్ నటి సోనీ రజ్దాన్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయం తెలియజేశారు. ''ఫలానా వారి కొడుకు లేదా కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు నెపోటిజం గురించి రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్న వారు ఏదొక రోజు తమ వారసుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. ఏం చేస్తారు.. వారిని ఆపగలుగుతారా’ అని సోని రజ్దాన్‌ ప్రశ్నించారు. అంతేకాకుండా ''ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చినా ఆడియన్స్ రియల్ టాలెంట్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని వ్యక్తిగా నాకు ఇది అందరి కంటే ఎక్కువగా తెలుసు'' అని ట్వీట్ చేసింది. కాగా సోనీ రజ్దాన్ బాలీవుడ్ లో యాక్టర్ గా డైరెక్టర్ గా అందరికి సుపరిచితమే. మహేష్ భట్ కి రెండో భార్య అయిన సోనీ గతేడాది వచ్చిన 'వార్' 'నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' చిత్రాల్లో నటించింది. 'నాజర్' 'అద్నాన్ ఖాన్' 'లవ్ ఎఫైర్' చిత్రాలకు దర్శకత్వం కూడా వహించింది.