Begin typing your search above and press return to search.
తనను తిట్టినందుకు పూలతో కొట్టిన 'ఆర్‌ఆర్‌ఆర్' బ్యూటీ
By: Tupaki Desk | 27 Jan 2020 7:21 AM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరియు ఆమె సోదరి రంగోలీలు పలువురు ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి గతంలో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఎంతో మందిపై తీవ్ర స్థాయిలో వీరు నోరు పారేసుకుని వీరితో పెట్టుకోవడం ఎందుకురా బాబోయ్ అనుకునేలా చేశారు. అంతగా వీరిద్దరు దూకుడుగా ప్రవర్తిస్తారు. గతంలో వీరిద్దరు కూడా ఆలియా భట్ ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆలియా భట్ కు పెద్దగా ప్రతిభ లేకున్నా కూడా ఆమె కుటుంబం ఇండస్ట్రీలో ఉన్న కారణంగా ఎంట్రీ దక్కిందని కామెంట్స్ చేశారు.
ఆలియా నటిగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న గల్లీ బాయ్స్ చిత్రం పై కూడా కంగనా కామెంట్స్ చేసింది. గల్లీ బాయ్స్ చిత్రం లో ఆలియా నటన చాలా సాదా సీదాగా ఉంటుందని వ్యాఖ్యలు చేసింది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆలియా భట్ పై ఈ సిస్టర్స్ ఇద్దరు పలు సార్లు విమర్శలు చేశారు. అయినా ఎప్పుడు కూడా ఆలియా భట్ నోరు విప్పలేదు. ఆ సిస్టర్స్ కామెంట్స్ కు స్పందించలేదు.
ఆ సిస్టర్స్ అంతగా విమర్శలు చేసినా కూడా తాజాగా కంగనాకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్బంగా ఆలియా అభినందిస్తూ పుష్పగుచ్చం పంపించి పద్మశ్రీ అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గ్రీటింగ్ ను కూడా పంపింది. అందులో విత్ లవ్ ఆలియా అంటూ రాసింది. ఆలియా పంపిన శుభాకాంక్షలను రంగోలి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆలియా శుభాకాంక్షలు తెలియజేయడం కంగనాకు ఏ విధంగా అనిపించిందో కాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది.
నెటిజన్స్ మాత్రం ఆ సిస్టర్స్ అంతగా విమర్శలు చేయడంతో తన మంచితనంను చూపించుకుంటూ ఇలా పూలతో వారిని కొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆలియా సమయస్ఫూర్తిని అంతా అభినందిస్తున్నారు. తనను విమర్శించిన వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలపడం చాలా గొప్ప విషయం అంటూ ప్రశంసలు దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆలియా 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.