Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' తో కలిసి థియేటర్లలోకి వస్తున్న ఆలియా..!

By:  Tupaki Desk   |   8 April 2021 7:22 PM IST
వకీల్ సాబ్ తో కలిసి థియేటర్లలోకి వస్తున్న ఆలియా..!
X
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''గంగూబాయి కతియావాడి''. హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ రచనలోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇటీవల విడులైన 'గంగూబాయి' హిందీ టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో జులై 30న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'గంగుబాయి' తెలుగు టీజర్ ని రేపు ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' థియేటర్లలో 'గంగూబాయి' తెలుగు టీజర్ ప్రదర్శించబడనుంది. ఈ నేపథ్యంలో ఆలియా భట్ ఓ వీడియో ద్వారా 'వకీల్ సాబ్' చిత్ర బృందానికి విషెస్ అందజేసింది. ''అందరికీ నమస్కారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి'' అంటూ అలియా తెలుగులో మాట్లాడింది. కాగా, 'గంగూబాయి' చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సంజయ్ లీలా భన్సాలీ - జయంతి లాల్ నిర్మిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్ - ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆలియా భట్ డెబ్యూ తెలుగు మూవీ 'ఆర్.ఆర్.ఆర్' దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది.