Begin typing your search above and press return to search.

ఆలియా ప్రియుడు మిస్సింగ్.. RRR టీమ్ కి టెన్ష‌న్?

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 AM GMT
ఆలియా ప్రియుడు మిస్సింగ్.. RRR టీమ్ కి టెన్ష‌న్?
X
ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌.. మ‌రోవైపు బాలీవుడ్ లో గంగూభాయి క‌తియావాడీ చిత్రీక‌ర‌ణ‌ .. ఈ రెండు షూటింగుల కోసం అటూ ఇటూ పరుగు పెడుతోంది ఆలియా భ‌ట్. ముంబై టు హైద‌రాబాద్ ఆలియా ప్ర‌యాణాల గురించి తెలిసిన‌దే. చ‌ర‌ణ్ తో సాంగ్ షూట్ లో పాల్గొనేందుకు మ‌రోమారు హైద‌రాబాద్ లో అడుగుపెడుతోంది! అంటూ మొన్న‌నే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈలోగానే ఆలియా నుంచి షాకిచ్చే విష‌యం తెలిసింది.

``మేజ‌ర్ మిస్సింగ్!..`` అంటూ బాంబ్ లాంటి వార్త‌నే చెప్పింది. మిస్స‌యిన‌ది ఎవ‌రు? అంటే ఆలియా బోయ్ ఫ్రెండ్ ర‌ణ‌బీర్ క‌పూర్. ఇంత‌కీ ఏమైంది? అంటే.. ర‌ణ‌బీర్ కి క‌రోనా పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆలియా ఖంగు తిందిట‌. కానీ అంత‌లోనే స‌ర్ధుకుని ర‌ణ‌బీర్ కి ఆరోగ్యం న‌య‌మైంది. మందుల‌తో త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు! అంటూ వెల్ల‌డించింది. అలాగే ర‌ణ‌బీర్ త‌ల్లిగారైన నీతు క‌పూర్ కూడా త‌న కుమారుడు కోలుకుంటున్నాడ‌ని వెల్ల‌డించారు. దీంతో అభిమానుల్లో కంగారు త‌గ్గింది.

కోవిడ్-19 పాజిటివ్ అని తెలిశాక ర‌ణ‌బీర్ స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లారు. అత‌డు ఒంటరిగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచింది ఆలియా. త‌మ‌మ‌ధ్య అన్యోన్య‌త‌కు సంబంధించిన‌ ఓ త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసింది. అలియా - రణబీర్ ఒక‌రికొక‌రు చేతిలో చెయ్యేసి లాల‌న‌గా ఉన్నారు ఆ ఫోటోలో. ఎన్న‌టికీ నినువీడ‌ను! అన్న భావ‌న ఆ ఫోటోలో క‌నిపించింది.

ఆలియా -రణబీర్ జంట‌గా న‌టించిన‌ మొదటి చిత్రం బ్రహ్మస్త్ర డ‌బ్బింగ్ పనులు సాగుతున్నాయి. కానీ ర‌ణ‌బీర్ కి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో డ‌బ్బింగ్ ప‌నులు ఆపేశారు. అదృష్ఠ‌వ‌శాత్తూ ర‌ణ‌బీర్ కి క‌రోనా పాజిటివ్ అని తేలినా కానీ ఆలియాకు నెగెటివ్ అని రిపోర్టు వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని ఆలియా త‌న‌ నోట్ లో అభిమానుల‌కు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే షూటింగుల‌కు ఎటెండ‌వుతున్నాన‌ని ఆలియా తెలిపారు.

అంతేకాదు.. ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెర‌కెక్కిస్తున్న `గంగూబాయి కతియావాడి` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే భ‌న్సాలీకి కూడా క‌రోనా వైరస్ పాజిటివ్ అని తేల‌డంతో షూటింగ్ ని నిలిపేశార‌ని తెలిసింది. ఇక‌పోతే ఏప్రిల్ లో ఆలియాతో ఆర్.ఆర్.ఆర్ సాంగ్ షూట్ ప్రారంభించేందుకు రాజ‌మౌళి టీమ్ సిద్ధ‌మ‌వుతోంది. ఆలియాకు నెగెటివ్ అన్న రిపోర్ట్ వ‌చ్చింది కాబ‌ట్టి జ‌క్క‌న్న‌కు ఇక టెన్స‌న్ లేన‌ట్టే అనుకోవ‌చ్చు!!