Begin typing your search above and press return to search.

సుశాంత్‌ ఆత్మహత్యతో 4.5 లక్షల మందిని కోల్పోయిన ఆలియా భట్‌

By:  Tupaki Desk   |   19 Jun 2020 8:10 AM GMT
సుశాంత్‌ ఆత్మహత్యతో 4.5 లక్షల మందిని కోల్పోయిన ఆలియా భట్‌
X
సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌ ప్రముఖులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పలువురు వారసులను పరిచయం చేసిన కరణ్‌ జోహార్‌ తో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్‌ గా వెలుగు వెలుగుతున్న వారసులను కూడా నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు. సుశాంత్‌ వంటి ప్రతిభావంతుడిని చిన్న చూపు చూడటంతో పాటు ఆయన ఎదుగుదలను అడ్డుకునేలా కొందరు ప్రయత్నించారు అంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట ఆయన అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్‌ కు చెందిన కొందరు కూడా ఈ విషయంలో వారిని విమర్శిస్తూ ఉన్నారు.

కంగనా రనౌత్‌ వంటి వారు వారసులపై మొదటి నుండే విమర్శలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఆమె వాదన మరింతగా పెరిగింది. నెపొటిజం.. ఫేవరెటిజం చూపించే వారిని వ్యతిరేకించాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. సోషల్‌ మీడియాలో వారిని అన్‌ ఫాలో అవ్వాలంటూ కొందరు పిలుపునిచ్చారు. దాంతో చాలా మంది సెలబ్రెటీల ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య తగ్గుతోంది.

గడిచిన మూడు రోజుల్లో ఆలియా భట్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ 4.5 లక్షల మంది ఆమెను అన్‌ ఫాలో అయ్యారు. ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య 4.5 లక్షలు తగ్గడం జరిగింది. ఇక కరణ్‌ జోహార్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 2 లక్షలు తగ్గింది. సల్మాన్‌ ఖాన్‌ అకౌంట్‌ ను 50 వేల మంది అన్‌ ఫాలో అయ్యారు. ఇదే సమయంలో సుశాంత్‌ ఆత్మహత్యపై గళం ఎత్తి బాలీవుడ్‌ ప్రముఖులకు వ్యతిరేకంగా మాట్లాడిన కంగనా రనౌత్‌ ఇంకా కృతి సనన్‌ ల ఫాలోవర్స్‌ సంఖ్య గడచిన రెండు మూడు రోజుల్లో భారీగా పెరింది.