Begin typing your search above and press return to search.

అలియా బికినీ అదిరింద‌య్యా!

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:49 PM GMT
అలియా బికినీ అదిరింద‌య్యా!
X
బికినీ క‌బుర్లు మ‌న‌కు కొత్తే. కానీ బాలీవుడ్‌ లో మాత్రం ప్ర‌తీ సినిమాలోనూ హీరోయిన్ బికినీ వేస్తుంటుంది. ప్ర‌స్తుతం అక్క‌డున్న క‌థానాయిల‌కంతా ఎప్పుడో ఒక‌సారి బికినీ వేసిన‌వాళ్లే. అందుకే బికినీల గురించి మ‌నం మాట్లాడుకొన్నంత ఆస‌క్తిగా బాలీవుడ్ జ‌నాలు మాట్లాడుకోరు. అయితే ఇటీవ‌ల అలియా భ‌ట్ వేసిన బికినీ చూశాక మాత్రం అక్క‌డి జ‌నాలు కూడా వాటి గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. రోజ్ క‌ల‌ర్ బికినీ వేసి బీచ్‌ లో న‌డిచొస్తుంటే ఆ అందాల్ని చూసి కుర్ర‌కారు తెగ ఇదైపోతున్నారు. బోలెడ‌న్ని బికినీ అందాల్ని చూశాం కానీ... అలియా బికినీ వేర‌యా అంటున్నారు.

షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా `శాందార్` అనే చిత్రం తెర‌కెక్కింది. అందులో హీరోయిన్ అలియా. క‌ర‌ణ్‌ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో అలియా త‌న అందంతో అద‌ర‌గొట్టేసిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లే ట్రైల‌ర్‌ ని విడుద‌ల చేశారు. అందులో అలియా బికినీ కూడా వేసింది. రోజ్ క‌ల‌ర్ బికినీలో బీచ్‌ లో న‌డిచొచ్చుంది. అది చూసి ఎదురుగా ఉన్న షాహిద్ కూడా ఫ్లాటైపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక సినిమాలో ఇంకే రేంజ్‌ లో రెచ్చిపోయిందో అని ప్రేక్ష‌కులు మాట్లాడుకొంటున్నారు.

అలియాకి బికినీ అంత బాగోదేమో అన్న అపోహ‌ని అలియా తుడిచేసిన‌ట్ట‌యింది. ఇక నుంచి హైట్‌ తో సంబంధం లేకుండా అంద‌రూ బికినీలు ధ‌రిస్తారు. అన్న‌ట్టు తోటి క‌థానాయిల‌క‌కి కూడా అలియా బికినీ అందాలు భ‌య‌పెట్టిస్తున్నాయ‌ట‌. మేం బికినీలు వేశాం కానీ.. ఇంత ఎఫెక్టివ్‌గా క‌నిపించ‌లేదని ఓపెన్‌గా ఒప్పుకొంటున్నార‌ట‌. మొత్తంగా పొట్టి అలియా గ‌ట్టిదే అనిపించుకొంది.