Begin typing your search above and press return to search.
బాత్రూంలో నిద్దరోతూ దొరికేసిన క్యూటీ
By: Tupaki Desk | 14 Nov 2016 10:30 PM GMTబాలీవుడ్ లో రేపటి తరం క్యూట్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే.. ఆలియా భట్ పేరు ఫస్ట్ లోనే వినిపించేస్తోంది. కేరక్టర్ల ఎంపికలో అంతలేసి జాగ్రత్తలు తీసుకుంటూ.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ను ఆ రేంజ్ లో పండిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం 'డియర్ జిందగీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. షారూక్ ఖాన్ తో కలిసి నటిస్తూ.. లీడ్ రోల్ దక్కించుకోవడం అంటే చిన్న విషయమా?
ప్రస్తుతం డియర్ జిందగీ ప్రమోషన్స్ లో ఉన్న ఆలియా.. చిన్నపుడు తన కొంటె చేసిన పనులను కూడా చెప్పేస్తోంది. 'నేను స్కూల్ కి వెళ్లినట్లే వెళ్లి.. బాత్రూమ్ లో నిద్రపోయే దాన్ని. క్లాస్ లో నేను కనిపించకపోయే సరికి టీచర్ కి అనుమానం వచ్చింది. ఆమె వచ్చేసరికి బాత్రూంలో సుబ్బరంగా కునకు తీస్తున్నా. అలా దొరికేసరికి ఆ టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. ఆ దెబ్బకు వారం రోజుల పాటు క్లాస్ రూంలో బల్లలు తుడిచా' అంటూ చిలిపి పనులను చెబుతోంది ఆలియా భట్.
ఇదంతా ఎందుకు చెప్పింది అనుకుంటున్నారా? చిల్డ్రన్స్ డే కదా.. అందుకే అన్నమాట. తన ఏజ్ 32 ఏళ్లయినా.. ఇంకా తాను చిన్నపిల్లనే అంటూ.. తన చిన్నప్పటి చిలిపి పనులు చెప్పి.. 'కావాలంటే ఇంట్లో నిద్రపోండి కానీ.. బాత్రూంలో కాదు' అంటూ సలహా కూడా ఇచ్చేసింది చిలిపి ఆలియా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/