Begin typing your search above and press return to search.

ఆ బుడతే.. ఇప్పుడు కింగ్ ఖాన్ హీరోయిన్

By:  Tupaki Desk   |   26 Nov 2016 4:00 AM IST
ఆ బుడతే.. ఇప్పుడు కింగ్ ఖాన్ హీరోయిన్
X
కాలం ఎంత వేగంగా మారిపోతుందో చెప్పడానికి ఇదో చక్కని ఎగ్జాంపుల్. ఓ సినిమాకి హీరోయిన్ గా నటించేటపుడు.. రియల్ లైఫ్ లో ఆమెకు పారాడే వయసులో ఉంటే.. ఆ బుడత అదే హీరోకి హీరోయిన్ గా నటించడం అనే సంఘటన ఊహించుకోగలమా? అలాంటి ఓ ఇన్సిడెంట్ ని ఫోటోతో సహా షేర్ చేసింది పూజా భట్.

ఇప్పటి యంగ్ హీరోయిన్ ఆలియా భట్.. మాజీ హీరోయిన్ పూజా భట్ కు స్టెప్ సిస్టర్ అనే సంగతి తెలిసిందే. తన పిన్ని కూతురు పసిపాపగా ఉన్నపుడు తను పొదివి పట్టుకుని ఉన్న ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసింది పూజా. 'చాహత్ మూవీ షూటింగ్ జైపూర్ లో జరుగుతున్నపుడు.. షూటింగ్ అయిపోయాక సాయంత్రం నేను-ఆలియా ఉన్న ఈ ఫోటో క్లిక్ చేశాం. ఆ సమయంలో వర్క్ లోడ్ తో షారుక్-నేను విపరీతంగా అలిసిపోయి ఉన్నాం. ఇప్పుడా పసిపాప పెద్దదైపోయి.. యంగ్ ఉమన్ అయిపోయింది. అంతే కాదు షారూక్ ఖాన్ తో తను నటించిన మూవీ రిలీజ్ అయిపోతోంది కూడా. కాలం ఎంత వేగంగా పరుగెడుతుందో!' అంటోంది పూజా భట్.

ఆ మధ్యన సైఫ్‌ ఆలీ ఖాన్ తొలి వెడ్డింగ్ కు గెస్టుగా 'అంకుల్' అనుకుంటూ వెళ్ళిన కరీనా కపూర్ తరువాత సైఫ్‌ నే పెళ్ళిచేసుకున్నట్లు.. ఇప్పుడు ఆలియా కూడా.. తన అక్కయ్య హీరోయిన్ గా చేసిన హీరోతో.. కలసి నటించడం.. కెవ్వు కేకలే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/