Begin typing your search above and press return to search.

ఈ పిల్లకు మగాళ్ల పెర్ఫ్యూమ్‌ కావాలట

By:  Tupaki Desk   |   25 July 2015 11:55 AM IST
ఈ పిల్లకు మగాళ్ల పెర్ఫ్యూమ్‌ కావాలట
X
బాలీవుడ్‌ లో స్పీడున్న కుర్రతారగా ఆలియాభట్‌ పేరు చెబుతుంటారు. ఒంపు, సొంపు, హొయలు ఉన్న స్పెషల్‌ బ్యూటీ గా కుర్రకారు మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఆలియా. నవతరం నాయికలకు పక్కా కాంపిటీటర్‌ గా తయారైంది. అయితే ఈ అమ్మడి అలవాట్లు కూడా అంతే ట్రెండీ గా, కాస్త తేడాగానూ ఉన్నాయి.

ఆలియా ఇంతింతై అంతెత్తు ఎదిగినా ఇప్పటికీ టీవీలో 'టామ్‌ అండ్‌ జెర్రీ' చూస్తుంటుంది. అంటే ఇప్పటికి బాలా కుమారి లక్షణాలు పోలేదనే దీనర్థం. అలాగే ఇప్పటికీ చాక్లెట్‌ బ్రాండ్‌ ఐస్‌ క్రీమ్స్‌ ని తెగ లాగించేస్తుంటుంది. ఐస్‌ క్రీమ్‌ బండి వెళ్లిపోతుంటే ఆపి మరీ కొనుక్కుని తింటుంది. అంతేనా ఎప్పుడూ ఒంటరిగా కూచుంటుంది. పార్టీలంటే ఎలర్జీ. అదొక్కటే కాదు తను ప్రేమించే పెళ్లి చేసుకుంటుందిట. ప్రేమించాక పెద్దల్ని ఒప్పిస్తుందిట. అంతేనా ఈవిడకి పెర్ఫ్యూమ్స్‌ అంటే విపరీతమైన పిచ్చి. వాటిని మార్కెట్లో ఎడా పెడా కొనేస్తుంటుంది.

అయితే అవన్నీ మగాళ్లు వాడే బాటిల్స్‌. ఆడాళ్లు వాడే సెంటులో ఘాటు ఎక్కువగా ఉండదని మగాళ్లు ఉపయోగించే పెర్ఫ్యూమ్స్‌ నే కొనేస్తుందిట. పెర్ఫ్యూమ్‌, సెంటు బాటిళ్లను ఆడ, మగ అనే తేడాతో కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఆడాళ్ల కోసం ప్రత్యేకించి డియో డ్రెంట్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. వాటిని కొనుక్కోకుండా ఇలా తేడాగా ఈవిడ మగాళ్ల సెంటునే ఎందుకు కొనుక్కుంటున్నట్టు? సంథింగ్‌ ఈజ్‌ రాంగ్‌.