Begin typing your search above and press return to search.
'గంగూబాయి' కేసులో RRR బ్యూటీకి కాస్త ఊరట..!
By: Tupaki Desk | 20 Aug 2021 2:50 PM ISTప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ''గంగూబాయి కతియావాడి''. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే తన తల్లి గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తు ఈ సినిమాపై ఆమె కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గతంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి, కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ కేసు విచారణపై బాంబే హైకోర్టు స్టే విధించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
'గంగూబాయి' సినిమా నేపథ్యంలో కోర్టు నోటీసులు రావడం పై ఆలియా - సంజయ్ లీలా భన్సాలీ తరపు న్యాయవాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ఆగష్టు 10న హై కోర్టులో విచారణ జరుగగా.. స్థానిక కోర్టులో జరుగుతున్న కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. సెప్టెంబర్ 7న తదుపరి విచారణ జరగాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అలియా - సంజయ్ లీలా భన్సాలీ - రైటర్ హుస్సేన్ జైదీలకు కాస్త ఊరట లభించింది.
కాగా, 'ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' నవలలో పేర్కొన్న కొన్ని విషయాలు అవమానకరంగా ఉన్నాయని.. ఈ సినిమా గంగుబాయి కతియావాడి ప్రతిష్టను దిగజార్చుతుందని బాబూజీ రాజీ షా ఆరోపించారు. గంగుబాయి కతియావాడి పేరు మళ్లీ వినిపించడంతో తన కుటుంబం.. ప్రజల నుంచి దూషణలు, వేధింపులను ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు. ఈ మేరకు దర్శక నిర్మాతలు - రచయిత - హీరోయిన్లపై బాబూజీ రాజీ ఫిర్యాదు చేశాడు.
ఇక సినిమా విషయానికొస్తే.. అనుకోని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్ గా మారిన య్యువతి.. 'మేడమ్ ఆఫ్ కామతిపుర గా రాణిగా ఎలా మారింది? ఆ తర్వాత కాలంలో సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఎలా పోరాడింది? అనేది ''గంగూబాయి కతియావాడి'' చిత్రంలో చూపించనున్నారు. పవర్ ఫుల్ గంగుబాయి పాత్రలో అలియా భట్ కనిపించనుంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ - ఇమ్రాన్ హష్మి - హ్యూమా ఖురేషి ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
భన్సాలీ ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సంజయ్ లీలా భన్సాలీ - జయంతి లాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ మరియు తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. గతేడాది సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన 'గంగూబాయి' సినిమా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జులై 30న రిలీజ్ చేయాలని అనుకోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నారనే వార్తలు వచ్చాయి. మరి త్వరలోనే ఈ సినిమా విడుదల పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.