Begin typing your search above and press return to search.

తన తల్లిని అవమానించారు.. ఆలియాపై కోర్టుకెక్కాడు

By:  Tupaki Desk   |   23 Aug 2021 5:05 PM IST
తన తల్లిని అవమానించారు.. ఆలియాపై కోర్టుకెక్కాడు
X
బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా వెలుగొందుతోంది ‘ఆలియా భట్’. ప్రస్తుతం ఈమె తెలుగులో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోనూ ఉంది.సినిమాల్లో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ హాట్ బ్యూటీగా పేరొందింది.

తాజాగా ఓ షోలో అడిగిన ప్రశ్నకు వింతగా జవాబు ఇచ్చింది. ఇప్పుడు ట్రోల్స్ బారినపడింది. తన కెరీర్ లో ఏనాడు వెనకడుగు వేయని ఆలియా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తన పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది.

ప్రస్తుతం ఆలియా నటిస్తున్న మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘గంగబాయి కతియావాడి. ప్రముఖ రచయిత హుస్సేన్ ఖైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

అయితే ఈ సినిమాలో తన తల్లి పాత్రను కించపరిచారు అంటూ గంగూభాయి కుమారుడు బాబూజీ షా స్థానిక కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు ముంబై హైకోర్టుకు చేరింది. గతంలోనే ఈ పిటీషన్ పై సినిమా దర్శకుడు సంజయ్ లీలీ బన్సాలీ, నటి ఆలియా భట్, రచయిత హుస్సేన్ జైదీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాను రూపొందించేందుకు ఆధారమైన ‘ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ నవలలోని కొన్ని సన్నివేశాలు అవమానకరంగా ఉన్నాయని.. దీనివల్ల తమ కుటుంబంపై ప్రజలు ద్వేషం పెంచుకుంటున్నారని బాబూజీ షా ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సినీ బృందానికి కాస్త ఊరట లభించినట్టైంది.