Begin typing your search above and press return to search.

హైవేలో పొద‌ల వెన‌క్కి వెళ్లిన స్టార్ హీరోయిన్!!

By:  Tupaki Desk   |   22 Jun 2021 5:30 AM GMT
హైవేలో పొద‌ల వెన‌క్కి వెళ్లిన స్టార్ హీరోయిన్!!
X
సుదీర్ఘ ప్ర‌యాణాల్లో సెల‌బ్రిటీల‌కు అయినా అన్ని సౌక‌ర్యాలు కావాలంటే కుద‌ర‌దు. నేను పాన్ ఇండియా స్టార్ ని కార‌వ్యాన్ వెంట తేవాల‌ని అడిగినా కుద‌ర‌దు. వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి అడ‌వుల్లోకి వెళ్లేప్పుడు లేదా హైవేల్లో ప్ర‌యాణించేప్పుడు అవ‌న్నీ కుద‌ర‌వు.

ఆన్ లొకేష‌న్ కార‌వ్యాన్ ఉంటే ఏ అసౌక‌ర్యం ఉన్నా వెంట‌నే స‌ర్ధుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. వ్యాన్ లోకి వెళ్లి అన్ని గ‌డ‌బిడ‌లు క‌ల‌త‌ల్ని తీర్చుకుని తిరిగి షూటింగుకి హాజ‌రు కావ‌చ్చు. అలా కాకుండా షూటింగ్ కోసం హైవే మార్గంలోనే వెళుతూ ఉంటే అలాంట‌ప్పుడు ఏం చేయాలి? ఇదే విష‌యంపై మాట్లాడిన స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ షాకిచ్చే విష‌యమే చెప్పింది.

ఇంతియాజ్ అలీ `హైవే` షూటింగ్ సమయంలో జరిగిన ఒక వింత సంఘటనను అలియా ఓపెన‌ప్ అయ్యింది. ఆమె బహిరంగ ప్ర‌దేశంలోనే వెళ్లాల్సొచ్చింద‌ట‌. హైవే జ‌ర్నీలో అలా న‌న్ను ప్రకృతి పిలిచింది!! అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు ఆలియా. అదేంటో కానీ అప్పుడు అలా వెళ్లాల్సొచ్చింది.. కాక‌పోతే మా బృందం చాలా దూరం ప్రయాణించవలసి వచ్చింది. అందుకే దారిలో పొద‌ల వెన‌క‌ ప్రకృతి పిలుపును అందుకున్నాను! అంటూ న‌వ్వేస్తూ చెప్పింది.

హైవే లో నటించిన రణదీప్ హుడా- ఆలియా జంట న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి. ఇక‌పోతే ఆలియా త‌దుప‌రి గంగూబాయి కతియావాడి స‌హా ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేయాల్సి ఉంది. శంక‌ర్ మూవీలో చ‌ర‌ణ్ స‌ర‌స‌నా ఈ అమ్మ‌డి పేరు వినిపిస్తోంది.