Begin typing your search above and press return to search.

ఆలియాకి అంత ప్రమాదం జరిగిందా?

By:  Tupaki Desk   |   14 Dec 2015 9:00 PM IST
ఆలియాకి అంత ప్రమాదం జరిగిందా?
X
స్టేజ్ పెర్ఫామెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం క్రాకర్స్ - ఫైర్స్ ఏర్పాటు చేస్తుండడం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా బాలీవుడ్ కుర్ర హీరోయిన్ ఆలియా భట్.. ఇలాగే ప్రమాదానికి గురైంది. బిగ్ స్టార్ ఎంటర్ టెయిన్ మెంట్ అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రమాదం సంభవించింది. ఆలియా భట్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో క్రాకర్స్ ఆమె మీదకు దూసుకొచ్చాయి. దీంతో ఆమె మొహం - చేతులకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అది లైవ్ కార్యక్రమం కావడంతో అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ - వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ సమయంలోనే తీసిన ఫోటోనే పైన కనిపిస్తోంది. ఇంతగా ఓ సెలబ్రిటీ గాయాలపాలవడంతో.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. అంత అజాగ్రత్తగా కార్యక్రమం నిర్వహించిన వారిని నెటిజన్లు తిట్టిపోసేస్తున్నారు.

అయితే.. ఇలా గాయాలకు గురి కావడం ఆలియాకి కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా కాలికి గాయాలు - భుజాలు మెలిపడ్డం - వేళ్లు చితికిపోవడం లాంటి ప్రమాదాలు చాలానే సంభవించాయి. అయినా సరే.. ఈ కుర్ర హీరోయిన్ మాత్రం డేరింగ్ గా ఫీట్స్ చేస్తూనే ఉంది. ఇంతగా ఇంజ్యూర్ అయి కూడా.. చాలా నిబ్బరంగా ఉండడంతో.. అలియా భట్ కు పరామర్శలతోపాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.