Begin typing your search above and press return to search.
తాగేసి ఆలియా పక్కనే కూర్చొని...
By: Tupaki Desk | 18 April 2017 11:45 AM GMTఇప్పుడు హీరోయిన్లకు చుక్కలు చూపిస్తున్నారు వారి సొంత మనుషులు. అసలే ఈ మధ్యన పరిస్థితులు బాగోట్లేదంటే.. ఇప్పుడు తమ సెక్యూరిటీ కోసం పెట్టుకున్న మనుషులే ఈ భామలకు పెద్ద ఛాలెంజ్ గా తలనొప్పిగా తయారయ్యారు. అదిగో ఆలియా భట్ కు జరిగిన సంఘటన చూస్తే మరోసారి ఇది అర్దమవుతోంది.
రాత్రి 3 గంటల వరకు ఏదో మీటింగ్ ఉండటంతో.. హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో గడిపిందట ఆలియా భట్. ఆ తరువాత తన ఫ్లాట్ కు వెళదాం అని చెప్పి తన బాడీగార్డుకు ఫోన్ చేస్తే.. మనోడు చాలాసేపటి తరువాత వచ్చాడట. తీరా చూస్తే కారులో ఈమె పక్కన కూర్చున్న వెంటనే అతగాడి నోటి నుండి మందు వాసన రావడంతో ఆలియా జడుచుకుందట. అతను మత్తులో అలా తూలుతూ ఉంటే.. తాను మాత్రం గండెలు అరచేతిలో పెట్టుకున్నానని.. చాలా భయం వేసిందని ఆలియా తెలిపింది. ఆ సమయంలో అరిస్తే అతడు ఏమైనా చేస్తాడేమోనని అనిపించి.. కామ్ గా ఉందట. ఇక తెల్లారి విషయం తెలుసుకున్న ఆలియా తల్లి సోని రాజ్ధాన్.. ఆ బాడీగార్డును జాబులో నుండి తీసేసింది.
ఈ మధ్యనే హీరోయిన్ భావనపై ఎటాక్ జరిగాక.. ఇక డ్రైవర్లను బాడీగార్డులను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేస్తోంది. లేకపోతే అంతపెద్ద స్టార్ హీరోయిన్ పక్కన తాగేసి కూర్చున్నాడంటే.. ఎథికల్ వాల్యూస్ ఏమైపోయినట్లు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/