Begin typing your search above and press return to search.
వీడియో : ఎయిర్ పోర్ట్ లో స్టార్ హీరోయిన్ పరుగుతో ప్రయాణికులు షాక్
By: Tupaki Desk | 5 May 2022 2:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఏం చేసినా కూడా సంచలనమే అనడంలో సందేహం లేదు. ఆమె ఇటీవలే గంగూభాయ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. అద్బుతమైన నటన అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
హీరోయిన్ గా కెరీర్ లో అలాంటి సినిమాలు అప్పుడప్పుడు చేస్తేనే కెరీర్ కు గౌరవం అంటూ అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇక ఆలియా భట్ ఇటీవలే ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఈ జంట షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది అంటూ ఇటీవల హిందీ మీడియా లో కథనాలు వచ్చిన విషయం తెల్సిందే.
రణభీర్ కపూర్ మొన్నటి వరకు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమా లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా లో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ తాజాగా ఎయిర్ పోర్ట్ లో జరిగింది.
పబ్లిక్ గా ఆలియా భట్ ఎయిర్ పోర్ట్ లో పరుగులు పెడుతూ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. కొన్ని సెకన్ల తర్వాత అది ఒక సినిమా షూటింగ్ కోసం అంటూ తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. హీరోయిన్ గా ఆలియా భట్ ప్రస్తుతం టాప్ స్టార్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఆలియా భట్ తో మూవీ అంటే ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి.
కరణ్ జోహార్ దర్శకత్వంలో ఈ మద్య కాలంలో సినిమాలు రాలేదు. ఆయన కేవలం నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆలియా భట్ ను ఎన్టీఆర్ 30 సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. మొదట ఓకే చెప్పిన ఆలియా ఆ తర్వాత నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 30 హీరోయిన్ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.