Begin typing your search above and press return to search.
GQ NYE కవర్ పై హాటెస్ట్ ఆలియాపైనే కళ్లన్నీ
By: Tupaki Desk | 3 Jan 2021 7:00 PM ISTఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ రణతంబోర్ వెకేషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసినదే. అక్కడి నుంచి ప్రియుడు రణబీర్ తో తన కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఆలియా పంచుకుంటోంది. అవన్నీ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
అలియా భట్-రణబీర్ కపూర్.. అలాగే దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ శనివారం తమ రణతంబోర్ (రాజస్థాన్) సెలవుల నుండి తిరిగి ముంబైకి చేరుకున్నారు. ముంబైకి వచ్చాక ఆలియా మరిన్ని ఫోటోల్ని పంచుకున్నారు. ప్రియుడు రణబీర్ కపూర్... అతని కుటుంబం ..అమ్మ నీతు కపూర్ - సోదరి రిద్దిమా కపూర్ సాహ్ని- బావమరిది భరత్ సాహ్ని -మేనకోడలు సమారాతో సహా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఈ నటి ఆమె తల్లి ఆమె సోదరి తో కలిసి ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ఇంతలోనే ప్రఖ్యాత జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీ రివీలైంది. GQ NYE కవర్ పై ఆలియా హాటెస్ట్ అవతారం వేడెక్కించింది. ఇక తనతో పాటే షాహిద్ కపూర్ - రోహిత్ శర్మ- అక్షయ్ కుమార్ ఉన్నారు. వీళ్లలో ఎవరు ది బెస్ట్? అంటే ఆలియాపైనే కళ్లన్నీ. ఆ ముగ్గురూ బ్లాక్ సూట్లతో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తుంటే ఆలియా మాత్రం పింక్ లో గులాబీ పువ్వులా మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా ఆ థై స్లిట్ లుక్.. మేని అందాల కవ్వింత అగ్గి రాజేస్తోంది. ట్యాగ్ యువర్ ఎన్.వై.ఇ క్రూ.. అన్న క్యాప్షన్ తో జీక్యూ ఈ ఫోటోని రివీల్ చేసింది. ఇది నిజానికి త్రోబ్యాక్ ఫోటో. కానీ అభిమానుల్లో వైరల్ గా దూసుకెళుతోంది. ఆలియా తదుపరి ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉండగా.. ఇతర భారీ పాన్ ఇండియా సినిమాలతోనూ బిజీ కానుంది. భన్సాలీతో గంగూబాయి కతియావాడీ అనే కళాత్మక బయోపిక్ చిత్రంలో వేశ్య పాత్రలో నటిస్తోంది.