Begin typing your search above and press return to search.
కండల వీరుడి చెల్లిగా చరణ్ హీరోయిన్
By: Tupaki Desk | 19 March 2019 10:12 AM GMTఇటీవల జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ హీరోయిన్ గా అలియా భట్ పేరు ప్రకటించడం ఆలస్యం హిందీ సినిమాల మీద పెద్దగా అవగాహనా తెలుగు ప్రేక్షకులు ఎవరీ భామ అని వెతకడం మొదలుపెట్టారు. బాలీవుడ్ లో డిమాండ్ పీక్స్ లో ఉండి మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న ఈ బ్యూటీ ఊపిరి సలపనంత బిజీగా మల్టీ స్టారర్స్ తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తోంది.
ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ హీరోగా కల్ట్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీయబోయే రొమాంటిక్ మూవీలో అలియా భట్ ఉండొచ్చని బాలీవుడ్ టాక్. అయితే ఐదు పదులు దాటిన సల్మాన్ పక్కన లేత గులాబీ లాంటి అలియా ఎలా సూట్ అవుతుంది అనే అనుమానం వస్తోంది కదా. అయితే తను చేసేది జోడిగా కాదు. చెల్లిగా చాలా కీలకమైన పాత్ర ఇందులో ఉంటుందట. అంటే మరో యంగ్ హీరో ఉంటాడన్న మాట
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రాజెక్ట్ ఓకే అయిన విషయాన్నీ సల్మాన్ ట్విట్టర్ లో ప్రకటించేశాడు. సల్మాన్ భన్సాలీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమా హం దిల్ దే చుకె సనమ్. ఇది విడుదలై 20 ఏళ్ళు దాటినప్పటికీ ఎవర్ గ్రీన్ లవ్ మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయింది. అన్నట్టు దీనికి టైటిల్ ఇన్షాల్లాగా ఫిక్స్ చేశారు.
పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్ టైనరా లేక ఏదైనా యాక్షన్ పాళ్ళు మిక్స్ చేశారా లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. అలియా చెల్లెలా ప్రియురాలా అనే టాపిక్ మీద సోషల్ మీడియాలో అప్పుడే రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇంకో నెల రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి.