Begin typing your search above and press return to search.

సీతాపాప‌కు RRR సీత‌మ్మ అరుదైన కానుక‌

By:  Tupaki Desk   |   8 Dec 2020 5:53 AM GMT
సీతాపాప‌కు RRR సీత‌మ్మ అరుదైన కానుక‌
X
అల్ల‌రి పిడుగు సితార ఘ‌ట్ట‌మ‌నేని అల్ల‌రి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇన్ స్టా ట్విట్ట‌ర్ స‌హా సొంత యూట్యూబ్ చానెల్ తో ఇప్ప‌టికే బోలెడంత పాపుల‌ర్ అయిన ఈ క్యూట్ గాళ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ వార‌సురాలిగా ఇప్ప‌టికే వెబ్ లో బోలెడ‌న్ని సంచ‌ల‌నాల‌కు తెర తీస్తోంది.

సీతాపాప ఇంత‌కుముందు ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లోనూ మ‌మ్మీ డాడీ మ‌హేష్ -న‌మ్ర‌త‌తో క‌లిసి క‌నిపించింది. సితార‌కు సంబంధించిన ఏ చిన్న విష‌యాన్ని విడిచిపెట్ట‌కుండా న‌మ్ర‌త మ‌హేష్ స్వ‌యంగా ఇన్ స్టా వేదిక‌గా రివీల్ చేస్తున్నారు. త‌న అంద‌మైన ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తున్నారు.

తాజాగా న‌మ్ర‌త షేర్ చేసిన ఓ ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. సీతాపాప ఓ సింపుల్ క్యూట్ మిడ్డీ డ్రెస్ లో క‌నిపించింది. వైట్ ఫ్రాక్ .. డిజైన‌ర్ మిడ్డీ లో స్టెప్పులేస్తూ ఎంతో ల‌వ్ లీగా ఆక‌ట్టుకుంది. ఇంత‌కీ ఈ డ్రెస్ ఎక్క‌డిది? అంటే.. బాలీవుడ్ ట్యాలెంటెడ్ క‌థానాయిక ఆలియా భ‌ట్ కానుక‌గా ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని న‌మ్ర‌త‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు.
సీతాపాప‌కు ఇంత మంచి కానుక ఇచ్చినందుకు ఆలియాకు థాంక్స్ చెప్పారు.

నిన్న‌నే ఆలియా భ‌ట్ హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో దిగి అట్నుంచి నేరుగా రాజ‌మౌళిని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు ఆలియా హైద‌రాబాద్ కి వ‌చ్చారు. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లూరి(చ‌ర‌ణ్‌) స‌ర‌స‌న సీత పాత్ర‌లో ఆలియా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిన‌దే.

అయితే ఈసారి హైద‌రాబాద్ విజిట్ లో నేరుగా న‌మ్ర‌త మ‌హేష్ ఇంటికి వెళ్లార‌న్న‌మాట‌. అక్క‌డ క్యూట్ సితార‌కు ఈ డ్రెస్ ని కానుక‌గా ఇచ్చారు. `థాంక్యూ ఆలియా ఫ‌ర్ ది ల‌వ్ లీ డ్రెస్` అంటూ న‌మ్ర‌త ఆనందం వ్య‌క్తం చేశారు.