Begin typing your search above and press return to search.

#RRR .. సీత‌ అదిరే ట్విస్టిస్తుంద‌ని గుస‌గుస‌

By:  Tupaki Desk   |   31 Oct 2020 4:15 AM GMT
#RRR .. సీత‌ అదిరే ట్విస్టిస్తుంద‌ని గుస‌గుస‌
X
ఇండియ‌న్ స్క్రీన్ పై వ‌స్తున్న మోస్ట్ మెమ‌ర‌బుల్ ఫిల్మ్ గా `ఆర్ ఆర్ ఆర్‌`నిలుస్తుందా? అంటే అందుకు స‌మాధానంగా ఇప్ప‌టికే రెండు టీజ‌ర్లు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచాయి. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాతో జ‌క్క‌న్న హార్డ్ హిట్టింగ్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేస్తున్న తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ప్ర‌ధానంగా ద‌క్షిణాదిలో ఈ త‌ర‌హాలో తెర‌పైకి వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ఈ న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి ఎంట‌ర్ కాబోతోంది.

రామ్‌చ‌ర‌ణ్... ఎన్టీఆర్‌లు పాల్గొన‌గా అలియాపై కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఇందులో ఈ మూడు పాత్ర‌ల మ‌ధ్య సాగే సైద్ధాంతిక ఘ‌ర్ష‌ణ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. సినిమాలో అలియా పాత్ర‌కు ఓ పాట వుంద‌ని ఆ పాట ఓ హైలైట్ గా నిలుస్తుంద‌ని మేక‌ర్స్ నుంచి వినిపిస్తోంది. సీత‌గా ఆలియా పాత్ర‌లో ఊహించ‌ని ట్విస్టులుంటాయిట‌. పైగా న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర కావ‌డంతో అలియాని రాజ‌మౌళి ఎంచుకున్నారు. పైగా బాలీవుడ్ దృష్టిని కూడా ఆక‌ర్షించాలంటే బాలీవుడ్ క్రేజీ ఆర్టిస్ట్ అవ‌స‌రం అని భావించి ఆమెని తీసుకున్నారు.

ఇక ఇటీవ‌ల విడుద‌లైన `రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌` టీజ‌ర్ సినిమాని వివాదం గురించి తెలిసిన‌దే. ఎంపీ సోయం బాబూరావు ఇటీవ‌ల మ‌రోసారి రాజ‌మౌళిని హెచ్చ‌రించారు. అయినా జ‌క్క‌న్న మౌన‌మే సామాధానం అన్న‌ట్టుగా వివాదంపై పెద‌వి విప్ప‌డం లేదు. సైలెన్స్ ని మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ సారి స్పందించ‌క‌పోతే ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశం వుంద‌ని షూటింగ్ ‌ని ఆపినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నా ఇవేవీ ప‌ట్టించుకోకుండా ఒక శిల్పిలా జ‌క్క‌న్న ఆయ‌న ప‌ని ఆయ‌న చేసుకుపోతున్నారన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.