Begin typing your search above and press return to search.

చరణ్ హీరోయిన్ స్పేస్ అంతేనా?

By:  Tupaki Desk   |   23 Jun 2019 9:43 AM IST
చరణ్ హీరోయిన్ స్పేస్ అంతేనా?
X
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అప్ అండ్ డౌన్స్ మధ్య పలు వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న టీం త్వరలో అహ్మదాబాద్ లాంగ్ షెడ్యూల్ కోసం వెళ్లనుంది. అక్కడే రామ్ చరణ్ సరసన నటిస్తున్న అలియా భట్ పాల్గొనాల్సి ఉంది. ఏదో నరాల ఇన్ఫెక్షన్ కారణంగా యుఎస్ వెళ్లిన ఆలీయా ఆ టైంలోపు వస్తుందా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ లో అలియా పాత్ర ఆశించినంత రేంజ్ లో ఉండదని కేవలం కొన్ని సన్నివేశాలు ఓ రెండు పాటల్లో భాగం తప్ప మరీ ఇలాంటి ఆర్టిస్ట్ తప్పనిసరిగా చేయాలన్న రోల్ అయితే కాదని ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. రాజమౌళి సినిమాలో చేయాలన్న ఎగ్జైట్మెంట్ తో ఒప్పుకోవడమే కానీ తనకు అంత సీన్ ఉండదనేది లేటెస్ట్ అప్ డేట్

ఇది నిజమో కాదో కానీ మొత్తానికి అలియా భట్ రోల్ గురించిన సస్పెన్స్ అయితే ఇప్పట్లో వీడేలా లేదు. రాజమౌళి చెప్పిన ప్రకారం చరణ్ పాత్ర అల్లూరి సీతారామరాజు తరహాలో ఉంటుంది. అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న మహిళ సీత పాత్ర త్యాగంతో కూడి ఉంటుంది. మరి ఆర్ ఆర్ ఆర్ లో ఇదే సూత్రాన్ని పాటించి ఉంటే కనక అలియా భట్ రోల్ ఎమోషనల్ గా ఉండే ఛాన్స్ ఉంది కానీ సినిమా మొత్తం కనిపించే అవకాశం గురించి చెప్పలేం. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కు జోడీనే దొరకలేదు. మరోపక్క ఏవేవో అవాంతరాలు. వచ్చే ఏడాది జులై 30కి ఆర్ఆర్ఆర్ వస్తుందా అనే అనుమానాలు క్రమక్రమంగా బలపడుతున్నాయి