Begin typing your search above and press return to search.

#వేశ్యగా ఆలియా.. గంగూభాయ్ గుట్టు మొత్తం లీక్!

By:  Tupaki Desk   |   26 Feb 2021 8:30 AM GMT
#వేశ్యగా ఆలియా.. గంగూభాయ్ గుట్టు మొత్తం లీక్!
X
ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతోంది ఆలియా భ‌ట్. బాలీవుడ్ ఆడియెన్ ని ఇన్నాళ్లు త‌న‌దైన ట్యాలెంట్ తో ఓల‌లాడించిన ఆలియా ట్రీట్ తెలుగు అభిమానుల‌కు స్పెష‌ల్ గా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించిన ఈ భామ‌ అనంత‌రం ప్రియుడు ర‌ణ‌బీర్ తో ఓ జాలీ ట్రిప్ త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న గంగూభాయి క‌తియావాడి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది.

గంగూబాయి కతియావాడీ టీజర్ నిన్న‌నే విడుద‌లై అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇందులో వేశ్య‌గా ఆలియా న‌ట‌న‌కు అన్ని వర్గాల నుండి ప్రశంసలు ద‌క్కాయి. టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పుట్టినరోజు వేడుక‌కు ఆలియా హాజరయ్యారు. ఆలియా ఈ వేడుక‌ల్లో చాలా సింపుల్ లుక్ తో క‌నిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తాజాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఆలియా న‌టిస్తున్న గంగూభాయ్ పాత్ర గురించి ప్ర‌స్తుతం టాలీవుడ్ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఆమె పాత్ర‌ ప్ర‌త్యేక‌త ఏమిటి? అంటే.. గంగూభాయ్ ఒక సాధార‌ణ గుజ‌రాతీ అమ్మాయి. 16 వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డి త‌ల్లిదండ్రుల్ని ఎదురించి ప్రియుడితో ముంబైకి లేచిపోయి పెళ్లి చేసుకొంది. త‌న‌ చిన్నతనం నుంచి సినీ నటి కావాలే కోరికతో ఉన్న గంగూభాయ్‌ ఆశా పరేఖ్- హేమామాలిని వంటి స్టార్ల‌ను ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని ప్ర‌య‌త్నించారు. కానీ ప్రాణంగా ప్రేమించిన వాడు వేశ్యావాటిక‌కు రూ.500కోసం అమ్మేస్తాడు. ఆ త‌ర్వాత గంగూభాయికి ఎదురైన అనుభ‌వాలేమిటి? అన్న‌దే గంగూభాయ్ క‌తియావాడి క‌థాంశం.

వేశ్యా వాటిక‌లో ఎన్నో అఘాయిత్యాలు. అన్నిటినీ గంగూభాయ్ భ‌రిస్తుంది. గ్యాంగ్ స్టర్ కరీం లాలా గ్యాంగ్ కు చెందిన సభ్యుడు గంగూభాయ్ ‌ని రేప్ చేస్తాడు. త‌న‌పై అత్యాచారం చేసిన వాడిని నిల‌దీస్తూ క‌రీంలాలానే ప్ర‌శ్నించిన వేశ్య‌గా సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుంది. ఆ త‌ర్వాత లాలా త‌న‌కు రాఖీ క‌ట్టి న్యాయం చేస్తాడు. ఈ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించారు.

ముంబై హెరా మండీ రెడ్ లైట్ ఏరియాలో ఎంతో మంది మహిళలకు అండగా నిలిచిన గొప్ప మ‌హిళ‌గా గంగూభాయ్ పేరు నాడు మార్మోగింది. వేశ్య‌ల‌కు ఆమె ఆశాదీపం. వేశ్యావాటిక‌ల‌కు అమ్మాయిల్ని బ‌ల‌వంతంగా తేకూడ‌ద‌నే నియ‌మం ప్ర‌కారం ఎంద‌రినో కాపాడింది. అందుకే ఇప్ప‌టికి ముంబై రెడ్ లైట్ ఏరియాలో ప్ర‌తి ఇంట్లో గంగూభాయ్ ఫోటో ఉంటుంద‌ట‌. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ఇంత‌కుముందు దీనిపై `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై` పేరుతో న‌వ‌ల‌ను రాయ‌గా అది సంచ‌ల‌నం సృష్టించింది. దానినే భ‌న్సాలీ సినిమాగా తీస్తున్నారు.

ఆలియా న‌టించిన RRR.. బ్రహ్మస్త్ర.. స‌డ‌క్ 2 ఇవ‌న్నీ పాన్ ఇండియా సినిమాలే. 2021-22 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ఆలియా పూర్తి బిజీ. వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ను అల‌రించ‌నుంది.