Begin typing your search above and press return to search.

RRR: ఆలియా పారితోషికం?

By:  Tupaki Desk   |   15 March 2019 6:53 AM GMT
RRR: ఆలియా పారితోషికం?
X
2019-20 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ మూవీగా RRR గురించి ప్ర‌చారం సాగుతోంది. రామారావు- రాజ‌మౌళి- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా క‌థానాయిక‌ల వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నాయిక ఆలియా భ‌ట్ - హాలీవుడ్ బ్యూటీ డైజీ క‌థానాయికలుగా ఆడిపాడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో చేరుతున్న ఆనందంలో ఆలియా ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యింది. రాజ‌మౌళి స‌ర్ కి థాంక్స్ .. మంచి టీమ్ తో ప‌ని చేసే అదృష్టం క‌లిగింది! అంటూ ఎంతో ఎగ్జ‌యిట్ అయిపోయింది. అయితే ఆ ఎగ్జ‌యిట్ మెంట్ వెన‌క చాలా పెద్ద డ్రామా న‌డిచింద‌ని తెలుస్తోంది.

అస‌లింత‌కీ ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తున్నందుకు ఆలియా భ‌ట్ పారితోషికం ఎంత తీసుకుంటోంది? అంటే షాకిచ్చే విష‌యం తెలిసింది. ఆలియాని ఈ సినిమాలో సీత పాత్ర‌కు ఒప్పించేందుకు రాజ‌మౌళి బృందం చాలానే చ‌ర్చ‌లు జ‌రిపిందిట‌. పారితోషికం విష‌యంలో ఆలియా అస‌లు బెట్టు వీడ‌లేద‌ట‌. దీంతో నెల‌రోజుల పాటు ఓపిగ్గానే ఆలియాని ఒప్పించే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలుస్తోంది. త‌న డిమాండ్ నెర‌వేరాక కానీ - ఓకే ఈ చిల్లు బుగ్గ‌ల బ్యూటీ ఓకే చెప్ప‌లేదు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో 7-10 కోట్ల మ‌ధ్య పారితోషికం అందుకుంటోంది. ఇండియా లెవ‌ల్లో అన్ని భాష‌ల్లో రిలీజ‌య్యే సినిమా కాబ‌ట్టి ఏకంగా 10-15 కోట్ల మ‌ధ్య‌లో ఈ అమ్మ‌డు డిమాండ్ చేసింద‌ని తెలుస్తోంది.

ఆలియా రేంజు మ‌న స్టార్ హీరోల పారితోషికాల‌కు ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఓవైపు క‌ళాంక్ - బ్ర‌హ్మాస్త్ర లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తున్న ఆలియా `రాజీ` స‌క్సెస్ అనంత‌రం పారితోషికం అమాంతం పెంచేసింద‌ట‌. దీంతో నిర్మాత‌ల‌కు చెక్కులిచ్చేప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని మాట్లాడుకుంటున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ హీరోలు చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ఇద్ద‌రికీ దాన‌య్య పారితోషికం రూపంలోనే సుమారు 50 కోట్లు (రెవెన్యూ షేరింగ్ అయితే అంత‌కంటే డ‌బుల్) చెల్లించుకోవాల్సి ఉంటుంద‌న్న స‌మాచారం ఉంది. ఇప్పుడు క‌థానాయిక‌కే 10 కోట్లు పైగా పారితోషికం ఇస్తున్నారంటే ఇత‌ర బ‌డ్జెట్లు ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవాలి. బ‌డ్జెట్ ఎందుక‌ని 350-400 కోట్లు అవుతోందో ఊహించాలి. కేవ‌లం పారితోషికాల రూపంలోనే 80- 100కోట్లు పంపిణీ జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.