Begin typing your search above and press return to search.

అతడు ఆలియా మీద అంతలా ఆధారపడతాడట

By:  Tupaki Desk   |   18 Sept 2022 11:17 AM IST
అతడు ఆలియా మీద అంతలా ఆధారపడతాడట
X
బాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరున్న రణ్ బీర్ కపూర్.. అలియా జంటకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రీల్ జంట.. రియల్ జంటగా మారటం కొత్తగా లేకున్నా.. వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తే వావ్ అనాల్సిందే. దాదాపు నాలుగేళ్లు రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది జూన్ లో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రపంచానికి చాటారు. వీరిద్దరు జంటగా నటించిన బ్రహ్మస్త్ర ఇటీవల విడుదల కావటం.. మంచి వసూళ్లను సొంతం చేసుకోవటం తెలిసిందే.

గడిచిన కొంతకాలంగా బాలీవుడ్ మూవీలు సక్సెస్ కాని నేపథ్యంలో..ఆ చెడ్డ పేరు తొలిగే ప్రయత్నం చేసిన మూవీగా బ్రహ్మాస్త్ర నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్స్ కు పెద్ద ఎత్తున తిరిగిన ఈ కపుల్.. పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారిద్దరికి సంబంధించిన పలు విషయాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు బిజీస్టార్లే కదా.. ఒకరిపై ఒకరు ఆధారపడుతున్నారా? అన్న ప్రశ్నకు ఎవరూ ఊహించని సమాధానాన్ని ఇచ్చి అందరిని షాక్ కు గురి చేశాడు.

తాను చాలా ఇండిపెండెంట్ అని గొప్పలు చెప్పుకుంటాను కానీ అలియా మీద తాను ఎక్కువగా ఆధారపడుతుంటానని చెప్పుకొచ్చారు. ఈ మధ్యన ఆమె పక్కన లేకుంటే ఏ పని చేయలేకపోతున్నట్లుగా వెల్లడించారు. 'తినటం కూడా మానేసి ఆమె కోసం వెతుకున్నా. ఆమెఏం చేసినా చేయలేకపోయినా ఫర్లేదు.. కానీ ఆమె మాత్రం నా పక్కన కూర్చోవాలి' అంటూ చెప్పిన రణ్ బీర్ మాటలు నిజమేనని అలియా సర్టిఫై చేసింది.

రణ్ బీర్ అన్ని మర్చిపోతుంటాడని.. తాను పక్కన ఉండి ప్రతిదీ గుర్తు చేస్తుంటానని చెప్పుకొచ్చింది. ఏమైనా.. ఇద్దరు బిజీ స్టార్లు రియల్ జీవితంలో కపుల్ గా ఉండటం ఒక ఎత్తు అయితే.. భార్య మీద ఇంతలా డిపెండ్ అయ్యే భర్త స్టార్ నటుడిగా వెండి తెర మీద వెలిగిపోవటం చూస్తే.. జీవితం అంటే ఇదేగా? అన్న భావన కలుగక మానదు.