Begin typing your search above and press return to search.

భర్త పాన్ ఇండియా స్టార్ అవ్వాల‌ని భార్య త‌హ‌త‌హ‌!

By:  Tupaki Desk   |   17 Jun 2022 4:30 AM GMT
భర్త పాన్ ఇండియా స్టార్ అవ్వాల‌ని భార్య త‌హ‌త‌హ‌!
X
2022లో పుష్ప‌- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా హిట్లు వ‌చ్చాయి. ఇప్పుడు ఇదే రేంజు సంచ‌ల‌నం సృష్టించాల‌ని `బ్ర‌హ్మాస్త్ర` బృందం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఈ చిత్రం అనువాద‌మై విడుద‌ల‌వుతోంది. ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌తో పాటు ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసి ప్ర‌చారం చేయ‌డం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ర‌ణ‌బీర్ - ఆలియా ఇటీవ‌లే పెళ్లాడి ఇంకా కొత్త జంట‌గానే అభిమానుల క‌ళ్ల‌లో నిలిచి ఉన్నారు. అందువ‌ల్ల పెళ్ల‌యిన త‌ర్వాత ఈ జంట‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌స‌రం. పైగా ర‌ణ‌బీర్ కి ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కావ‌డంతో ఆలియాలోనూ అంతే క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. దేశంలో ర‌ణ‌బీర్ నంబ‌ర్ వ‌న్ హీరోగా స‌త్తా చాటాలంటే బ్ర‌హ్మాస్త్ర‌తో అత‌డు ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 ల‌ను బీట్ చేయాల్సిందే. కానీ ఇది సాధ్య‌మేనా? అన్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ క్వ‌శ్చ‌న్.

బ్ర‌హ్మాస్త్ర‌లో యూనిక్ థాట్ ఏం ఉంది?  థీమ్ ప‌రంగా క‌నెక్టివిటీ ఎంత‌? ఎమోష‌న్ కామ‌న్ ఆడియెన్ కి ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌వుతుంది? అన్న‌దే ఇప్పుడు విజ‌యానికి దారులు తెర‌వ‌గ‌ల‌దు. అయితే ఇది బాహుబ‌లి - ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హా ఫిక్ష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కానే కాదు. కేజీఎఫ్ - పుష్ప లాంటి మాస్ యాక్ష‌న్ చిత్రం అస‌లే కాదు. ఇది పూర్తిగా ఫాంట‌సీ ఫిక్ష‌న్ నేప‌థ్యంలోని సినిమా. పూర్తిగా విజువ‌ల్ గ్రాఫిక్స్ పై డిపెండ్ అయిన సినిమా అని ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ చెబుతోంది. ట్రైల‌ర్ పై డివైడ్ టాక్ కూడా వచ్చింది. ఇది టాలీవుడ్ లో వ‌చ్చిన ఢ‌మ‌రుకం-దేవీ పుత్రుడు-అంజి త‌ర‌హా అంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం సాగిపోయింది. అయినా ర‌ణ‌బీర్ - అయాన్ టీమ్ ఈ మూవీ విజ‌యంపై ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉంది.

ఇంత‌కుముందు `బ్రహ్మాస్త్ర` ట్రైలర్ విడుదలైన తర్వాత అయాన్ ముఖర్జీ ఒక నోట్ రాశారు. ``ఈరోజు నేను చాలా శక్తిని పొందాను`` అంటూ ఎగ్జ‌యిట్ అయ్యారు. నిస్సందేహంగా బ్రహ్మాస్త్ర 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ విజువ‌ల్ బొనాంజ అని తెలిపాడు. ట్రైలర్ లో ఆస్ట్రావర్స్ ప్రపంచాలను వీక్ష‌కుల‌కు పరిచయం చేశారు. ప్రధాన పాత్ర అయిన శివ (రణబీర్ కపూర్) అతని రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఇషా (ఆలియా భట్) జంట‌కు `బ్రహ్మాస్త్రం` అనే శివ లింక్ తో పరిచయం చేసారు.  ట్రైలర్ లో అమితాబ్ బచ్చన్-నాగార్జున పాత్ర‌ల్ని అంతే ప‌వ‌ర్ ఫుల్ గా చూపించ‌డంతో అంచ‌నాలేర్ప‌డ్డాయి. కానీ ఇది విజువ‌ల్ గ్రాఫిక్స్ నేప‌థ్యంలో సినిమా కావ‌డంతో దీనికి రీచ్ ఎంత‌? అంటూ ఒక సెక్ష‌న్ సందేహిస్తోంది.

ట్రైలర్ కు హిందీ బెల్ట్ నుంచి మంచి స్పందన వ‌చ్చినా సౌత్ లో మాత్రం పలు రకాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ట్రైలర్ కు ప్రేక్షకులు ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల‌ సిద్ధాంతాలు సమీక్షల‌ను చెబుతూ వెబ్ ని వేడెక్కించారు. ట్రైలర్ చూసి మూవీ థీమ్ ఏంటో నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఉత్త‌రాదిన‌ బజ్ భారీగా ఉంది. ఈ రెస్పాన్స్ తో ఉబ్బితబ్బిబ్బైన అయాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో సుదీర్ఘ నోట్ ని రాసారు. ``మా ట్రైలర్ లాంచ్ తో బ్రహ్మాస్త్ర ప్రయాణంలో ఇది చాలా అరుదైన‌ క్షణం. ట్రైలర్ కి స్పంద‌న బావుంది. మేం అందుకున్న ప్రేమ- ప్రోత్సాహం ప్రేక్ష‌కుల్లో ఉత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు నేను చాలా శక్తివంతంగా ఉన్నాను``అని రాశారు. మేము శక్తిని అందిస్తాము.. మరిన్ని సినిమాల్ని ఈ సిరీస్ లో అందిస్తాము... బ్రహ్మాస్త్ర ఒక కొత్త జానర్ తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవం ఇస్తుంది. మీరంతా గర్వించే సినిమా అవుతుంద‌ని నేను ఆశిస్తున్నాను! సెప్టెంబర్ 9 న వ‌చ్చేస్తున్నాం!`` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

బ్రహ్మాస్త్ర ట్ర‌యాల‌జీ మూవీ. ఇది 3-భాగాల ఫ్రాంచైజీ.. అసలైన విశ్వం ఆస్ట్రావర్స్ కు నాంది ప‌లుకుతున్న తొలి భార‌తీయ‌ చిత్ర‌మిది. బ్రహ్మాంశ్ అనే రహస్య సమాజం ఆవరణకు దూరంగా కథను మోడ్ర‌న్ డే దేశీ స్టోరీతో తెర‌కెక్కించారు. తరతరాలుగా ప్రాచీన భారతదేశంలో చ‌రిత్ర‌లో దాగి ఉన్న‌ అనేక దివ్యమైన `అస్త్రాల` (ఆయుధాలు)ను మ‌న పూర్వీకులు రక్షించారు. ప్రపంచం దృష్టి నుండి సురక్షితంగా ర‌క్షించ‌గ‌లిగారు. ఈ దివ్యమైన‌ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి.. ప్రాణాంతకమైనవి కూడా. అన్ని ఇతర అస్త్రాలతో పోలిస్తే ప్రభువు - దేవతల చెంత ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం బ్రహ్మాస్త్రం. ఇది ఈ మోడ్ర‌న్ డేలో మేల్కొంటుంది. ఇది ఈ రోజు మనం జీవిస్తున్న ఈ విశ్వాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని బెదిరింపు ఈ క‌థ‌లో ఉంది.

బ్రహ్మాస్త్ర: మొదటి భాగంలో శివ కథను చెబుతారు. శివ అనే ఒక యువకుడు తెర‌పై కథానాయకుడుగా క‌నిపిస్తాడు. అత‌డు ఇషా అనే అమ్మాయితో ప్రేమ‌లో ఉంటాడు. కానీ వారి ప్రపంచం తలకిందులవుతుంది. ఎందుకంటే శివుడికి బ్రహ్మాస్త్రానికి రహస్యమైన సంబంధం ఉందని అతనిలో ఒక గొప్ప శక్తి ఉందని బ‌హిర్గ‌త‌మ‌వుతుంది. అది అతనికి ఇంకా అర్థం కాని స‌న్నివేశంలో ప్రేమ‌క‌థ ర‌న్ అవుతుంది. అగ్ని శక్తిని అందిపుచ్చుకునే శివుడు అస్త్రాల ప్రపంచంలోకి ప్రయాణిస్తున్నప్పుడు అతని సాహసాలను తెర‌పై చూసి తీరాలి. క్రమంగా క‌థ‌లో భాగంగా విశ్వంలోని దైవిక హీరోగా అతడిని తెర‌పై చూపించ‌నున్నారు. చివ‌రికి శివుని డెస్టినీ ఏమిట‌న్న‌దే ఈ సినిమా. క‌థాంశం ఆస‌క్తిని క‌లిగించేదే. అయితే ఈ క‌థ‌ను ఎంత ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేశార‌న్న‌ది ఇప్పుడు అస‌లైన పాయింట్. ర‌ణ‌బీర్ న‌టుడిగా ఏ మేర‌కు రాణించాడు అన్న‌ది కూడా చూడాలి. ఆలియా త‌న  హ‌బ్బీని పాన్ ఇండియా స్టార్ గా చూడాలంటే బ్ర‌హ్మాస్త్ర ఘ‌న‌విజ‌యం సాధించి తీరాలి. రిలీజ్ కి ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ఉంది. ఈలోగా ప్ర‌చారం క‌లిసి రావాలి. ఇంకా మూవీకి ఆరంభ  రివ్యూలు చాలా కీల‌కం అవుతాయి. ఈ కొంత‌కాలం ఆలియా క‌ల‌లు కంటూ గ‌డిపేస్తుందేమో!