Begin typing your search above and press return to search.
వారంలో ఆలియా-రణబీర్ పెళ్లి.. గెస్ట్స్ లిస్ట్ ఇదే
By: Tupaki Desk | 6 April 2022 8:00 AM ISTవృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వేవ్స్ సృష్టిస్తున్నారు ఆలియా. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ వచ్చే వారం పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 17 మధ్య ముంబైలో వివాహ వేడుకలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాలలో ఒకటిగా ఈ వెడ్డింగ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. లవ్ బర్డ్స్ చాలా సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారు. అభిమానులు వాటిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
చెంబూర్ లోని రణబీర్ కపూర్ ఆర్.కె ఇంట్లో వచ్చేవారం వారి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం ఆలియా- రణబీర్ ఇద్దరూ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. నెటిజన్లు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు.
రణ్ బీర్-అలియా భార్యాభర్తలుగా మారడం పట్ల అభిమానులు ఆసక్తిని కనబరిచారు. బోలెడన్ని ఈమోజీ జోకులు వైరల్ అవుతున్నాయి. అభిమానులు పలు సృజనాత్మక ఫోటోలు.. వీడియోలతో తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఒక అభిమాని -``ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం .. ఇప్పుడు వారు చివరకు వివాహానికి సిద్ధమయ్యారు. మరొకరు ట్వీట్ చేస్తూ- ``ఈ ఇద్దరు క్యూటీస్ పెళ్లి చేసుకుంటున్నారు. వారిపై నజర్ లేదు.. ప్లీజ్ ఈ ఈవెంట్ లో వారు నన్ను ఎమోషనల్ మెస్ గా మార్చారు.. వారి పెళ్లి ఫోటోలు #AliaBhatt #Ranbir Kapoor ఎంత అందంగా ఉంటాయో ఊహించుకోండి`` అని ట్వీట్ చేశాడు.
రణబీర్ - అలియా బిగ్ డే గురించి ఆరా తీస్తే.. పెళ్లి ఏప్రిల్ లో జరుగుతుంది. వివాహ వేడుకలు ఏప్రిల్ 13 - 17 మధ్య జరుగుతాయి అన్న హింట్ అందింది. వరుసగా సంగీత్ - మెహందీ వేడుకలు కూడా షెడ్యూల్ చేసారు. కపూర్ -భట్ కుటుంబాలకు సన్నిహితంగా ఉండే సభ్యులు ఈ కాలంలో తమను తాము స్వేచ్ఛగా ఉండేలా సహకరించాలని కోరారు. ఆలియా తన వివాహ వేడుకలో మనీష్ మల్హోత్రా - సభ్యసాచి దుస్తులను ధరిస్తుంది అని కూడా తెలిసింది. పెళ్లి కుటుంబం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ప్రయివేట్ వ్యవహారంగా సాగుతుంది. అనంతరం ఏప్రిల్ నెలాఖరున ఈ జంట తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారు.
రణబీర్ కపూర్-ఆలియా భట్ వెడ్డింగ్ గెస్ట్ లిస్ట్ లో కరణ్ జోహార్- కరీనా కపూర్- షారుఖ్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం, రణబీర్ -అలియాల పెళ్లి వేడుకకు పరిశ్రమలో ఎవరు హాజరవుతారు? అన్నది ఆరా తీస్తే.. వివాహ అతిథి జాబితాలో సంజయ్ లీలా భన్సాలీ- వరుణ్ ధావన్- అయాన్ ముఖర్జీ- జోయా అక్తర్- మసాబా గుప్తా మొదలైన పేర్లు ఉన్నాయి. రణబీర్-అలియాల డి-డేకి షారుఖ్ ఖాన్ ను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. మరోవైపు కరణ్ జోహార్- మనీష్ మల్హోత్రా- అనుష్క రంజన్- ఆకాంక్ష రంజన్- కరీనా కపూర్ ఖాన్- సైఫ్ అలీ ఖాన్- కరిష్మా కపూర్ తదితరులు కూడా వివాహ వేడుకల్లో భట్ లు కపూర్ లతో కలిసి ఉంటారు.
వారి పెళ్లి తర్వాత రణబీర్ -అలియా ఏప్రిల్ చివరి నాటికి పరిశ్రమలోని తమ స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తారని మీడియా కథనాలొస్తున్నాయి. ఈ జంట వివాహ రిసెప్షన్ కు రణవీర్ సింగ్- దీపికా పదుకొణె- కరణ్ జోహార్- అయాన్ ముఖర్జీ- ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరవుతారని తెలిసింది. అదే సమయంలో కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రణబీర్ అలియా మొదటిసారిగా అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర లో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకుంటున్నారు. ఫాంటసీ డ్రామా మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది.