Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు చాలా పాట్లు ప‌డిన జంట‌!

By:  Tupaki Desk   |   23 April 2022 10:00 AM IST
పెళ్లికి ముందు చాలా పాట్లు ప‌డిన జంట‌!
X
ఆలియా భట్ - రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక ఇంటి వాళ్ల‌య్యారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఏప్రిల్ 13న ముంబైలో వేడుకలు ప్రారంభం కాగా.. వారం పాటు సంద‌డి నెల‌కొంది. అయితే ఈ పెళ్లికి ముందు ఈ జంట ఎక్క‌డ ఎలా క‌లిసారు? త‌మ ప్రేమాయ‌ణంపై తొలి ప్ర‌క‌ట‌న ఎవ‌రు ఎప్పుడు చేశారు? అన్న‌ది.. ప‌రిశీలిస్తే.. ఈ జంట మొదటిసారిగా 2018లో ముంబైలో సోనమ్ కపూర్- ఆనంద్ అహుజా వివాహ రిసెప్షన్ లో బహిరంగంగా కనిపించారు. అదే సంవత్సరం అలియా ఇన్ స్టాగ్రామ్ లో తన సంబంధాన్ని అధికారికం చేసింది.

తిరిగి 2018లో సెప్టెంబర్ 28న నటుడి పుట్టినరోజు సందర్భంగా ``హ్యాపీ బర్త్ డే సన్ షైన్`` అనే సందేశంతో రణబీర్ కపూర్ అందమైన స్నాప్ షాట్ ను అలియా అప్ లోడ్ చేసింది. ఈ జంట అయాన్ ముఖర్జీతో `బ్రహ్మాస్త్ర` షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు అప్ప‌టికి. తన తండ్రి రిషి కపూర్ చివరి చిత్రం `శర్మాజీ నమ్ కీన్` కోసం ఇటీవలి ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఆ విష‌యాన్ని వెల్లడించాడు. ``నేను మీకు డేట్ ఇవ్వలేను కానీ.. ఆలియా నేను సమీప భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఇది అనుకుంటున్నాము.. అని తెలిపారు.

అలియా భట్- రణబీర్ జంటగా `బ్రహ్మాస్త్ర` చిత్రంలో కనిపించనున్నారు. ఐదేళ్ల తర్వాత 2021 మార్చి చివరిలో షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం 9 సెప్టెంబర్ 2022న థియేటర్లలోకి రానుంది.