Begin typing your search above and press return to search.
ఒక్కటైన రణబీర్ కపూర్ -అలియాభట్
By: Tupaki Desk | 14 April 2022 9:00 PM ISTబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ వివాహ బంధంతో ఒకటయ్యారు. గురువారం ఇరు కుటుంబాలు..అతికొద్ది మంది అతిధుల సమక్షంలో బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్ లో వైభవంగా వివాహం జరిగింది. ఈ విషయాన్ని అలియాభట్ అభిమానులతో పంచుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించి అలియాభట్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ``గత ఐదేళ్లగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా వివాహం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది`` అని తెలిపారు. అలాగే అలియా- రణబీర్ వివాహం సందర్భంగా ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసారు. నవ దంపతులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు.
ఇద్దరు మెడలో పూల మాలలు ధరించారు. ఇరువురు ఒకే రకం డిజైనర్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. అలియా భట్ మెడలో ఖరీదైన జ్యూవెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నుదిటిన పాపిడిబొట్టు.. ఆ కిందనే ఎరుపు రంగు స్టికర్ ధరించారు. వరుడి చేతలో వధువు చేయి కనిపిస్తుంది. ఇక నుంచి జీవితాంతం కలిసి ఉంటానని...ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టబోను అన్న ప్రామిస్ కనిపిస్తుంది.
మరో ఫోటోలో వివాహం అనంతరం దంపతులు ఇద్దరూ పెదవి ముద్దులో కనిపిస్తున్నారు. రణబీర్ కౌగిలిలో మునిగిపోయిన అలియా ప్రియుడు కళ్లలో తదేకంగా చూస్తూ పెదవి ముద్దులో మునిగిపోయారు. ఇక మరోక ఫోటోలో ఒకరి కౌగిలిలో మరొకరు మునిగిపోయి నవ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చినట్లు కనిపిస్తుంది. మరో పిక్ లో అలియా భట్ భర్త చెవిలో ఏదో చెబుతూ రణబీర్ బుగ్గని ముద్దాడినట్లు కనిపిస్తుంది. మొత్తంగా రణబీర్ -అలియా పెళ్లి ఫోటోలు నెట్టింట అభిమానుల్ని ఆనందంలో ముంచుతున్నాయి.
ఐదారేళ్ల నీరిక్షణకు నేటితో తెరపడింది. పెళ్లి చేసుకుంటారా? ప్రేమికులుగా మిగిలిపోతారా? ఇలా ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చాయి. అన్నింటికి నేటితో పర్మినెంట్ గా పుల్ స్టాప్ పడింది. వివాహం అయిన సందర్భంగా అలియాభట్..రణబీర్ కపూర్ అభిమానులు నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అన్నిపరిశ్రమలో నటులు..నిర్మాతలు విషెస్ తెలియజేస్తున్నారు. ఈనెల 17న ముంబైలో ని ఓ స్టార్ హోటల్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి బాలీవుడ్..టాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యే అవకాశం ఉంది.